Advertisement
ప్రస్తుతం ఏపీని వణికిస్తోంది మిచౌంగ్ తుఫాన్, ఈ మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయిట. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ బాపట్ల వద్ద తీరం దాటింది. మధ్యాహ్నం 12:30 నుంచి తీరాన్ని తాకిన తుఫాన్ సాయంత్రం నాలుగు గంటలకి తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ తుఫాన్ కి పేరు ఎవరు పెట్టారు అనే విషయాన్ని కూడా చూద్దాము. మిచౌంగ్ అనే పేరుని మైనమార్ పెట్టింది. దీనికి అర్థం దృఢమైనది. వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ తుఫాను పేర్లని పెట్టడానికి బాధ్యత వహిస్తుంది.
Advertisement
2019 నుండి 2023 వరకు భారతదేశంలో వచ్చిన తుఫాన్ల లిస్ట్:
సైక్లోన్ బైపార్జోయ్:
ఇది జూన్ 6న తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో ఉద్భవించింది. జూన్ 15, 2023న గుజరాత్లో ల్యాండ్‌ఫాల్ అవుతుందని అన్నారు, దీని వేగం గంటకు 150 కిమీ కంటే ఎక్కువే.
సైక్లోన్ మాండస్:
అండమాన్ నికోబార్ దీవులు మరియు చెన్నై తీరాన్ని ఇది డిసెంబర్ 14, 2022న మారింది. 2022లో వచ్చిన మూడవ తుఫాను ఇది. .
సైక్లోన్ సిట్రాంగ్:
ఈ తుఫాను అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు అండమాన్ ని ప్రభావితం చేసింది.
అసని:
2022 లో వచ్చిన మొదటి తుఫాను ఇది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తీరాలను తాకింది.
జావద్:
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నుండి.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను జవాద్ తాకి మరింత బలపడుతుందని అన్నారు.
గులాబ్ తుఫాను:
యాస్ తుఫాను తర్వాత నెలరోజుల తర్వాత, గులాబ్ తుఫాను సెప్టెంబర్ 25న ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఆనుకుని ఉన్న ఒడిశా తీరాలకు హెచ్చరికలు జారీ చేసింది.
తౌక్టే:
2021 లో వచ్చిన మొదటి తుఫాను, మే 17, 2021న ఇది దక్షిణ గుజరాత్‌ను తాకింది. ఈ తుఫాను కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో ప్రాణనష్టం కూడా జరిగింది.
యాస్:
యాస్ తుఫాను మే 2021లో పశ్చిమ బెంగాల్ అలానే దాని పక్కనే ఉన్న ఒడిశా తీరాన్ని తాకింది. ఇవే కాకుండా నిసర్గ, హుక్కా, వాయు, BOB 03, మహా, బుల్ బుల్ కూడా వచ్చాయి.