Advertisement
కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Advertisement
ఈ సందర్భంగా ఆయన గురించిన వార్తలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
బీజేపీ అనుబంధ విభాగం ఎబివిపితో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ లో చురుగ్గా పాల్గొనే రేవంత్ రెడ్డి మలక్ పెట్ లో ఉండే వారు. కొంతకాలానికి అక్కడ నుంచి నారాయణపేట కు మారారు. అక్కడ మిస్టర్ యాడ్స్ పేరుతొ ఓ ప్రింటింగ్ ప్రెస్ ను నడిపేవారు. అయితే.. రాజకీయాల్లోకి వచ్చాక ఆ ప్రెస్ ను తమ్ముడు కృష్ణారెడ్డికి అప్పచెప్పారు.
2004 లో తెరాసలో చేరిన రేవంత్ రెడ్డి కల్వకుర్తి సీటు కోసం ప్రయత్నించారు. అయితే మూడేళ్లు ఎదురు చూసినా టికెట్ రాకపోవడంతో 2006 లో మిడిల్ జెడ్పిటిసి కోసం స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు.
ఆ తరువాత 2007 లో మహబూబ్ నగర్ స్థానంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందడం అప్పట్లో సంచలనాన్ని రేపింది. అదే ఏడాది టిడిపి లోకి చేరారు. 2009 లో కొడంగల్ సెగ్మెంట్ కు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 లో తెలంగాణ వచ్చిన తరువాత కూడా కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గెలుపొందారు. 2015 మే 15 న రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు.
అయితే కూతురు పెళ్లి సమయంలో అరెస్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహించారు. “నీ అంటూ చూస్తా.. నిన్ను గద్దె దించడమే నా లక్ష్యం” అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణాలో టీడీపీ ప్రాభవం తగ్గుతుండడంతో రేవంత్ రెడ్డి ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2018 లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలుపొందిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం 2021 జూన్ లో కాంగ్రెస్ చీఫ్ గా ప్రకటించింది. ప్రస్తుత ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి సెగ్మెంట్స్ లో రేవంత్ రెడ్డి పోటీచేశారు. అయితే కొడంగల్ లో గెలుపొంది, కామారెడ్డిలో ఓడారు. ఓవరాల్ గా ఎక్కువ స్థానాలు పొంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
Advertisement
#1)
#2)
#3)
#4)
#5)
#8)
#9)
#10)
#11)
#12)
#13)
#14)
#15)
#16)
#17)
#18)
Read More:
Hi Nanna Movie Review : ”హాయ్ నాన్న” తో నాని హిట్ కొట్టేసాడా..? కథ, రివ్యూ అండ్ రేటింగ్..!