Advertisement
హిందువులు దైవారాధనని బాగా నమ్ముతారు. అలాగే.. జ్యోతిష్యం, న్యూమరాలజీ వంటి వాటిని కూడా నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడే కొన్ని నమ్మకాలను కూడా హిందువులు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. వాటిల్లో ఒక నమ్మకం ఏంటంటే చెప్పులను, బూట్లను చోరీ చేయడం వలన కలిగే ప్రభావం. చెప్పులు దొంగిలించబడితే కూడా మీపై ప్రభావం ఉంటుందా? అని ఆశ్చర్యం అనిపించినా.. దీన్ని కొంతమంది వ్యక్తులు నమ్ముతూ ఉంటారు. ఇంతకూ.. చెప్పులు దొంగతనం జరిగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
శనివారం రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ చెప్పులు చోరీకి గురి అయితే.. అది ఓ శుభ సంకేతమట. మీ జీవితంలో ఉన్న చెడు రోజులు తొలగి.. మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్ధమట. రాబోయే రోజుల్లో మీ జీవితంలో సంతోషం, ఆనందం వెల్లివిరుస్తోందని అర్ధమట. శనిదేవుడు మానవుల పాదాలలో ఉంటారు. పాదరక్షలు శనికారకాలు కాబట్టే వాటిని ముట్టుకోవద్దు అని చెబుతూ ఉంటారు. అందుకే ఎవరైనా మీ పాదరక్షలను దొంగతనం చేస్తే.. మీపై శనిదేవుడి ఆశీర్వాదం ఉందని చెబుతారు.
Advertisement
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చెప్పులు దొంగిలించబడితే అది మీకు మేలు చేస్తుందని అర్ధమట. ఈ శాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తుల జీవితంలో శని దశ నడుస్తున్నప్పుడు వారు చేస్తున్న పనులకు ఎక్కువ అడ్డంకులు వస్తుంటాయి. వారు చేసే పనుల్లో విజయం లభించదు. అటువంటి పరిస్థితిలో ఆలయాల వద్ద వారి చెప్పులు దొంగతనానికి గురి కాబడితే.. అది వారికి శుభ శూచకమే. వారి కష్టాలు తొలగి.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని అర్ధం.
Read More:
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.. ఎక్కడ నుంచి మొదలైందంటే?
“రేవంత్ రెడ్డి” సర్కార్ కి BRS పంపిన డేంజర్ బెల్స్ ! వీటిని నిర్లక్ష్యం చేసారో అంతే !
రేవంత్ రెడ్డి గెలిచినా వీళ్ళ నుంచి ప్రమాదం పొంచి ఉందట ! షాక్ ఇచ్చిన వేణు స్వామి!