Advertisement
సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో రాజకీయాల్లో సినిమాల్లో కూడా బిజీగా ఉంటూ ఎంతోమంది ప్రేక్షకుల హృదయాన్ని కూడా గెలుచుకున్నారు. ఎన్టీఆర్ పేదవాళ్ళకి పట్టెడన్నం పెట్టిన దేవుడు అని కూడా అంటూ ఉంటారు. తెలుగు ప్రజల కోసమే ఉద్భవించాడు ఈ రాముడు అని చాలామంది భావిస్తారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు కూడా. అప్పట్లో యువకుల్ని ప్రోత్సహించి రాజకీయాల్లో వారి ప్రాధాన్యతని తెలియజేశారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Advertisement
ఎన్టీఆర్ పక్కన ఉన్న అతను ఎవరో మీకు తెలుసా అంటూ విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పక్కన ఉన్నది ఎవరో కాదు. హైదరాబాదులోని అత్యంత ధనిక ప్రాంతమైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హైదర్ గూడా లో ఈయన పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఏ పూర్తి చేశారు మాగంటి గోపీనాథ్. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 దాకా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వున్నారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా వున్నారు.
Advertisement
1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వున్నారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం తరుపు పోటీ చేసి గెలిచారు. తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసారు. గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా వున్నారు. 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!