Advertisement
ముఖ్యమంత్రి హోదాకి వచ్చేసిన తరువాత.. ఆయనను చూడాలి అంటే సామాన్యులకు కొంత కష్టతరమే అవుతుంది. ఎక్కడైనా పబ్లిక్ గా జరిగే సభలకు హాజరు అయితేనో, అధికారిక కార్యక్రమాలకు హాజరు అయితేనో తప్ప ఆయనను చూడడం సామాన్య ప్రజలకు అరుదుగానే జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా సీఎం చుట్టూ సెక్యూరిటీ, మంత్రులు, ఇతర మందీ మార్బలం ఉంటారు. సీఎం వస్తున్నారు అంటే.. ఆ చుట్టూ పక్కల ప్రాంతాలలో ఎవ్వరిని తిరగనివ్వకుండా భద్రతా కట్టుదిట్టం చేస్తారు. మరోవైపు జనాలు కూడా ఆయనను చూడాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు.
Advertisement
కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇందుకు మినహాయింపు. అందుకు సాక్ష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నే. ఆదివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం కోసం సోమాజీగూడలోకి యశోద హాస్పిటల్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన హాస్పిటల్ లోకి వచ్చిన వెంటనే ఓ మహిళా రేవంత్ అన్నా అంటూ ఆయన్ని పిలిచింది.
Advertisement
రేవంత్ రెడ్డి ఆగి.. ఆమె వద్దకు వెళ్లారు. ఆమెని కలిసి ఆమె సమస్య ఏంటో అడిగారు. అదే హాస్పిటల్ లో తన తండ్రిని హాస్పిటల్ లో చేర్పించారట. ఒక్క రోజుకే ఒకటిన్నర లక్ష బిల్లు అయ్యిందని.. నువ్వే ఆదుకోవాలన్నా అని కోరడంతో రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఇతర అధికారులను పిలిచి.. అక్కడి సమస్య ఏంటో చూసి ఆమెను జాగ్రత్తగా చూడాలని చెప్పారు. ఆమెకు అవసరమైన సాయం అందించి.. బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని హితవు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి సాయం చేయడంతో నెటిజన్స్ ఆయనను ప్రశంసిస్తున్నారు.
Read More:
ఇదెక్కడి దూకుడు అయ్యా ! రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో హరీష్ రావు షాక్ అయ్యారు !
ఎంత క్యూట్ గా ఉండే ! ఒక్కసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ !
Watch Video: