Advertisement
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయన సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒకటే చర్చ జరుగుతోంది. కేసీఆర్ గాయం వెనుక ఏమి జరిగింది? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అసలేమైంది? హరీష్, కేటీఆర్ ల మధ్య గొడవ నిజమేనా? అన్న చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కు భద్రతా లేదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
Advertisement
ఎన్నికల తరువాత నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కె పరిమితం అయ్యారు. ఎన్నికల ఫలితాల వలన దిగ్బ్రాంతి చెందుతూ తన వద్దకు వచ్చిన నాయకులకు ఆయన ధైర్యం చెబుతూ వస్తున్నారు. బాగానే ఉన్న కేసీఆర్ కు ఒక్కసారిగా గాయం ఎలా అయ్యింది? తుంటి ఎముక విరగడ యాక్సిడెంటల్ గానే జరిగిందా? లేక మరేదైనా జరిగిందా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆయనను సాధారణ అంబులెన్స్ లోనే ఆసుపత్రికి తీసుకెళ్లడం ఏంటి? అంటూ ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
Advertisement
ఎన్నికల ఫలితాల విషయమై కేటీఆర్ కు, హరీష్ కు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ వల్లే కేసీఆర్ కు ప్రమాదం జరిగిందని ఈ వార్తలలో పేర్కొంటున్నారు. అయితే అటువంటిదేమీ లేదని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో అసలు ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియదు. బిఆర్ఎస్ నేతలు మాత్రమే ఎవరో కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని.. బిఆర్ఎస్ నేతలందరూ బాగానే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం, తెలంగాణ రాష్ట్ర సాధకుడికి భద్రతా కల్పించడంతో అధికార కాంగ్రెస్ విఫలం అయ్యింది అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. కేసీఆర్ కు కనీస ప్రోటోకాల్ పాటించలేదని, సాధారణ అంబులెన్స్ లోనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More:
ఇదెక్కడి దూకుడు అయ్యా ! రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో హరీష్ రావు షాక్ అయ్యారు !
ఎంత క్యూట్ గా ఉండే ! ఒక్కసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ !