Advertisement
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటగా ఓ దివ్యంగురాలికి ఉద్యోగం ఇచ్చారు. ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి రజినీకి హామీ ఇచ్చారు. ఆమెకు కచ్చితంగా ఉద్యోగం ఇస్తానని మాటిచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి తూమురి రజిని అనే అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ.. అపాయింట్మెంట్ లెటర్ ని కూడా ఇచ్చేసారు. ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదే ఆమెకు ఈ లెటర్ ను ఇవ్వడం విశేషం. హైదరాబాద్ నాంపల్లి బోయిగూడకు చెందిన రజని లయోలా స్కూల్, వనితా కాలేజీలో తన ఎడ్యుకేషన్ పూర్తి చేసారు.
Advertisement
అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న సమయంలోనే ఆమె రేవంత్ రెడ్డిని కలిశారు. తనకి ఉద్యోగం లేదని ఆయనకి మొర పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ఉద్యోగం ఆమెకే ఇస్తానని రేవంత్ మాటిచ్చారు. ఆమె పేరు ఇతర వివరాలను నోట్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 6 గ్యారెంటీలకు సంబంధించిన డాక్యుమెంట్ పై రేవంత్ రెడ్డి మొదటి సంతకం చేసారు. రెండవ సంతకం రజిని ఉద్యోగ పత్రంపై చేశారు.
Advertisement
కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ప్రమాణస్వీకారానికి రజినీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఆమెకు ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపి, జాయినింగ్ ఆర్డర్ ని అందించారు. స్టేజిపైనే ఆమెకు శాలువా కప్పి ఈ పత్రాలని అందించారు. రజిని కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెకు తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో కాంట్రాక్టు బేసిస్ కింద ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆమెకి నెలకి రూ.50,000 ల జీతం అందుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read More:
ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడే కెసిఆర్ కి ఎందుకు ఇలా అయ్యింది ? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగింది ఇదే !
అందుకే కదా రేవంత్ రెడ్డి గారిని అందరు ఇష్టపడేది! ఏమి చేసారో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే !
ఇదెక్కడి దూకుడు అయ్యా ! రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో హరీష్ రావు షాక్ అయ్యారు !