Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొందరికి ఊహించని విజయం లభిస్తే మరికొందరికి అనుకోని పరాజయం ఎదురైంది. అయితే.. కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డిది మాత్రం ఆల్ టైం రికార్డుగా నిలిచింది. ఎందుకంటే ఆయన సీఎం కేసీఆర్ ని, కాబోయే సీఎం రేవంత్ రెడ్డిని కలిపి ఓడించాడు. ఈ విజయం సంచలనం సృష్టిస్తోంది.
Advertisement
ఈ నేపథ్యంలో కాటిపల్లి వెంకట రమణా రెడ్డి గురించి చాలానే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఉన్నత వ్యక్తిత్వం, సేవా స్వభావం, రాజకీయాల్లో ఆయనకు ఉన్న కమిట్మెంట్, పారదర్సకతలకు నెటిజన్స్ జై కొడుతున్నారు. అయితే.. ఆయన వెహికల్ నెంబర్ గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. కోటిపల్లి వెంకట రమణారెడ్డి కార్ నెంబర్ 4749 . దీనిని ఆయన మాములు గవర్నమెంట్ లెక్కల ప్రకారమే టాక్స్ కట్టి సీరియల్ ప్రకారం తీసుకున్న నెంబర్.
Advertisement
అయితే.. ఆయన ఈ నెంబర్ ను మాత్రమే తీసుకోవడానికి ఓ కారణం ఉందట. ఆ నెంబర్ ను ఆయన మోదీ అన్న పేరు కనిపించేలా పెట్టించుకున్నారు. ఈ నెంబర్ అలా కనిపిస్తుంది కాబట్టే.. ఆయన ఆ నెంబర్ ను తీసుకున్నారట. అలాగే ఆయన చేతిపై కూడా ఓ టాటూ ఉంటుంది. జాతీయ జండా, దాని కింద కమలం గుర్తు టాటూ ఉంటాయట. దీనిని ఆయన 2018 ఎలెక్షన్స్ లోనే వేయించుకున్నారు. ఆ సమయంలో బిజెపి గెలవకపోవడంతో.. ఆయన కాంగ్రెస్ పార్టీ మారే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ రావడంతో.. ఆయన నేను ఎప్పటికీ బీజేపీ పార్టీని మారను అన్న ఉద్దేశ్యాన్ని అందరికి తెలియ చెప్పడం కోసం ఈ టాటూ వేయించుకున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Watch Video: