Advertisement
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త అర్ధం చెప్పారన్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే.. సినిమా రంగంలో బాగా రాణించిన అన్నగారు రాజకీయాల్లోనూ తిరుగులేని పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన తన బాధ్యతలను రాష్ట్ర ప్రజలు మెచ్చేలా నిర్వహించారు. అయితే.. 1989 లో జరిగిన కల్వకుంట్ల ఎన్నికల్లో మాత్రం ఆయన అప్పటి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన జె.చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కాంగ్రెస్ నేత చిత్తరంజన్ దాస్ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు.
Advertisement
ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి, విజయం సాధించిన కూడా ఎక్కడా నేను ఎవ్వరిని అవమానించడం కానీ, పరుల సొమ్ముని ఆశించడం కానీ నేను చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. 1985 కాంగ్రెస్ పార్టీ నుంచి జె.చిత్తరంజన్ దాస్ కల్వకుంట్ల ఎమ్మెల్యే పదవి కోసం బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఆ తరువాత 1989 లో కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసారు. అదే ఏడాది ఆ స్థానం కోసం సీనియర్ ఎన్టీఆర్ కూడా పోటీ చేయగా.. విజయం చిత్తరంజన్ దాస్ సొంతం అయ్యింది. సీనియర్ ఎన్టీఆర్ హిందూపురంతో పాటు.. కల్వకుంట్ల కూడా నామినేషన్ వేశారు.
Advertisement
ఆ సమయంలో కూడా నేను ధైర్యాన్ని కోల్పోలేదని, ఆ స్థానంలో నేనే గెలుస్తానన్న ధీమాగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ టైం లో నా చెప్పు తీసుకెళ్లి అక్కడ పెట్టినా కూడా.. ఈ ఎన్నికల్లో నేనే గెలుస్తాను అని ఆయన చెప్పడం అప్పట్లోనే సంచలనం రేపింది. ఆ టైం లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. ప్రజలు కూడా నావైపే ఉండడంతో నేను గెలుస్తాను అని ధీమా గా ఉన్నానని చిత్తరంజన్ దాస్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులూ చెన్నారెడ్డి సహకారంతో ఆ ఎన్నికల్లో విజయం సాధించానని చెప్పుకొచ్చారు.
Read More:
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో తళుక్కుమన్న ఈ అమ్మాయి ఎవరు? ఈమెకి తెలంగాణ పాలిటిక్స్ కి ఏమి సంబంధం?