Advertisement
ప్రతి నిజమైన బంధానికి నిజాయితీ మరియు పారదర్శకత అవసరం. కానీ మీరు మీ భాగస్వామితో ప్రతిదీ పంచుకోవాలని దీని అర్థం కాదు. కొన్నిసార్లు, ఇది బంధాన్ని దెబ్బతీస్తుంది. దంపతుల మధ్య దాపరికాలు ఉండకూడదని అంటుంటారు. కానీ, కొన్ని విషయాలను పొరపాటున కూడా చెప్పకూడదు. ఇంతకీ జీవిత భాగస్వామి వద్ద కూడా రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
కొంతమంది తమ భర్తలను, ఎదుటివారి భర్తలతో పోల్చుకుంటూ ఉంటారు. వారు భార్యని చాలా బాగా చూసుకుంటారు, అవీ..ఇవీ కొనిపెడుతూ ఉంటారు అని నిష్టురలు ఆడుతూ ఉంటారు. అయితే.. ఇలా పోల్చడం వలన భాగస్వామిలో తెలియకుండా అభద్రతా భావం వస్తుంది. కొన్ని సార్లు ఇది తీవ్రంగా మారి అనుమానాలకు కూడా తావిచ్చే అవకాశం ఉంది. కొందరైతే ఏకంగా తమ భార్య లేదా భర్తలలోని లోపాలను కటువుగా చెబుతుంటారు.
Advertisement
ఒక జంటలో ఇద్దరికీ ఒకేరకమైన అభిరుచి ఉండాలని ఏమీ లేదు. మీకు నచ్చనివి ఏమైనా ఉంటె అది అతనికో లేక ఆమెకో అనారోగ్యం, ఆపద తీసుకురానంత వరకూ పరవాలేదు. మీకు మరీ ఇబ్బంది కలిగించేదిగా ఉంటె కొంచం తగ్గించుకుంటే నాకు నచ్చుతుంది అన్నట్లు.. సున్నితంగా, ప్రేమగా చెప్పడం నేర్చుకోండి. మీ భాగస్వామి తరపు వాళ్లంతా మీకు నచ్చాలని రూల్ ఏమి లేదు. వారి మాటతీరు, ప్రవర్తనలు మీకు నచ్చకపోవచ్చు. ఇలాంటివి బయటకి చెప్పడం కంటే మనసులోనే ఉంచుకోవడం మేలు. ఇలా ప్రతి చిన్నదీ చెప్పుకుంటూ పోతే పరిస్థితి మీకే వ్యతిరేకంగా మారొచ్చు. గతంలో ప్రేమించిన వారి విషయాల గురించి అసలు ప్రస్తావించకపోవడమే మేలు. ఎంత అర్ధం చేసుకునే భాగస్వామి వచ్చినా కొన్నిసార్లు అర్ధం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. అది కానీ అనుమానంగా మారితే.. మీ జీవితమే నరకప్రాయం కావచ్చు.
Read More:
సీనియర్ ఎన్టీఆర్ ని కల్వకుంట్ల ఎన్నికల్లో ఓడించడానికి ఈయన చేసిన పని ఏంటో తెలుసా?
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో తళుక్కుమన్న ఈ అమ్మాయి ఎవరు? ఈమెకి తెలంగాణ పాలిటిక్స్ కి ఏమి సంబంధం?