Advertisement
ఈ మధ్యకాలంలో దర్శకులు, నిర్మాతలు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటేనే భయపడిపోతున్నారు. దీనికి కారణం హీరోల రెమ్యునరేషన్ భారీగా పెంచేశారు. దీంతో టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. సినిమాల బడ్జెట్ కూడా ఎక్కువవుతోంది. దీనివల్ల నిర్మాతలు సినిమా హిట్ టాక్ వస్తే తప్ప బయట పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే టికెట్ల రేట్లు పెరగడం వల్ల థియేటర్ లో చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు. ఏదైనా స్టార్ హీరో సినిమా కథ బాగుండి అన్నీ నచ్చితేనే థియేటర్ వైపు వెళ్తున్నారు. ఒక్కోసారి అన్నీ బాగున్నా సినిమా ఫ్లాప్ అవుతోంది. ఈ మధ్యకాలంలో నెగిటివ్ టాక్ వచ్చి హిట్ అయిన కొన్ని సినిమాలు అవేంటో చూద్దాం..
Advertisement
1. సర్కారు వారి పాట :
పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రిలీజైన మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. తర్వాత మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు చేసింది.
2. బంగార్రాజు :
నాగార్జున,నాగచైతన్య కలిసి నటించిన ఈ మూవీ ముందుగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓవరాల్ గా హిట్టయింది. ఈ సినిమాలో చైతు కొత్త రికార్డు క్రియేట్ చేశారు. మీడియం రేంజ్ హీరోలలో 50 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు.
3. పుష్ప
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ ముందుగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.. తర్వాత సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయింది. నార్త్ లో ఈ సినిమా చరిత్రను తిరగ రాసింది.
4. వెంకీ మామ:
ఈ సినిమాలో వెంకటేష్ మరియు నాగచైతన్య కలిసి నటించారు. ముందుగా ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకొని, తర్వాత మంచి వసూళ్లను చేపట్టింది.
5. ఇస్మార్ట్ శంకర్ :
ఈ మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా విడుదలైంది. ముందుగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత 18 కోట్లు లాభాలతో కుమ్మేసింది.
6. జై సింహ :
జై సింహ మూవీ కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. బాలకృష్ణ హీరోగా నయనతార హీరోయిన్ గా ముందుగా నెగిటివ్ టాక్ తెచ్చుకొని తర్వాత హిట్ టాక్ తెచ్చుకుంది.
7.రచ్చ :
ఆరెంజ్ మూవీ డిజాస్టర్ కావడంతో రచ్చ లాంటి అవుట్ డేటెడ్ కథతో సినిమా చేశారు చరణ్. ముందుగా ఫ్లాప్ టాక్ వచ్చినా, 40 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
Advertisement
8. శౌర్యం :
శౌర్యం మూవీ కూడా మొదటి మూడు రోజులు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ మెల్లిమెల్లిగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ రాబట్టింది.
9. ఎంసీఏ :
నాని హీరోగా నటించిన మూవీ ఎంసీఏ. ముందుగా ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకొని, తర్వాత సేఫ్ జోన్ కు వెళ్ళింది. కేవలం సాయి పల్లవి కారణంగానే ఈ సినిమా హిట్ అయిందని టాక్.
10. పవర్ :
ఈ మూవీ రవితేజ బాబి కాంబినేషన్లో థియేటర్ లోకి వచ్చింది. ఈ సినిమా నిలబడడం ఇక కష్టమే అనుకున్న సమయంలో, రెండు కోట్ల లాభాలతో 23 కోట్ల షేర్ వసూలు చేసింది.
11. జల్సా :
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ముందుగా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. మెల్లి మెల్లిగా పుంజుకుని హిట్ అయింది.
12.బిజినెస్ మాన్ :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ మూవీ ముందు నెగిటివ్ టాక్ తెచ్చుకొని తర్వాత హిట్ అయింది.
13.నాన్నకు ప్రేమతో :
సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మూవీ తొలిరోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ చివరికి 54 కోట్ల షేర్ వసూలు చేసి హిట్టయింది.
14. పెళ్లి సందడి :
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా 7.50 కోట్ల షేర్ వసూలు చేసి చివరికి హిట్ అయింది.
15. జనతా గ్యారేజ్:
కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్, మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించిన మూవీ జనతా గ్యారేజ్. ఈ సినిమా కూడా ముందుగా నెగెటివ్ టాక్ వచ్చినా చివరికి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
ALSO READ:
ఇంటిని రెంటుకు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే ఇబ్బందులు తప్పవా..