Advertisement
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.. రాజకీయ నాయకులయందు కొందరు లీడర్లు వేరయా.. అని కూడా చెప్పుకోవాలని అనిపిస్తుంది ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి రాజకీయ నాయకులను చూస్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆయన గురించిన ఓ సంఘటన కామారెడ్డి ఎమ్మెల్యే గా ఎన్నికైన కాటిపల్లి వెంకట రమణా రెడ్డి వివరించారు. కామారెడ్డి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు పోటీ చేసినప్పటికీ.. ఓడిపోయారు. అంతలా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అక్కడి జనంతో మమేకమయ్యారు. వై ఎస్ ఎందుకు నిజమైన లీడర్ అన్న విషయాన్నీ ఆయన మాటల్లోనే చూద్దాం.
Advertisement
ఆయన అప్పటికి నిజామాబాద్ జెడ్పి చైర్మన్ గా ఉన్న రోజుల్లో… ఓ రోజు వై ఎస్ మీద అభిమానం కొద్దీ ఆయన ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నారట. అందరు మాట్లాడుకుంటూ ఉండగానే.. కింద ఓ గొడవ మొదలైంది. ఓ బక్క రైతు వై ఎస్ ను కలవాలి అంటూ కింద సెక్యూరిటీ తో గొడవపడుతున్నాడు. వై ఎస్ ను కలవనివ్వకపోతే అక్కడే చచ్చిపోతా అని అంటున్నాడు.
Advertisement
విషయం తెలుసుకుని వై ఎస్ అతన్ని లోపలకి పంపమని ఆదేశించారు. ఆ రైతు లోపలకు రాగానే వై ఎస్ ఎదురెళ్లి మీ బాధ ఏమిటో చెప్పాలని అడిగాడు. దానికి ఆ బక్క రైతు తనకు ఓ అర ఎకరం పొలం ఉందని, దాన్ని అమ్మి పిల్ల పెళ్లి చేయాలనీ అనుకున్నానని.. కానీ పాస్ బుక్ లేని కారణంగా అది అమ్మడం జరగలేదని.. ఆ పాస్ బుక్ కోసం అడిగితే ఇప్పటివరకు రాలేదని చెప్పాడు. అప్పటికప్పుడు వై ఎస్ సంబంధిత మండల తహసీల్దార్ కు ఫోన్ చేసి పని వెంటనే జరిగేలా చూసాడు. అంతే కాదు.. ఆ రైతుకి రెండు లక్షల డబ్బు ఇచ్చి ఇద్దరి పిల్లలకు చెరొక లక్షతో పెళ్లి చేసి.. పొలం మాత్రం కొడుకు కోసం ఉంచాలని సూచించారట. దానితో ఆ బక్క రైతు వై ఎస్ కాళ్ళ మీద పడిపోయాడు. ఇలాంటి సంఘటనలు వై ఎస్ జీవితంలో కోకొల్లలు. అందుకే ఆయనను గొప్ప లీడర్ అని అంటుంటారు.
Read More:
26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన యశస్వినీ రెడ్డి ఎవరో తెలుసా ? బ్యాక్ గ్రౌండ్ ఇదే !
పెళ్లి చేసుకునే వారికి ఇలాంటి లక్షణాలు ఉంటె చాలా కష్టమట.. అవేంటో తెలుసుకోండి!
తన ఇంట్లో వంట మనిషికి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిలోంచి తీసెయ్యాలా అంటూ..?