Advertisement
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ ఎంపీ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అంతర్గత సమాచారం ప్రకారం లగడపాటికి విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 2014,2019లో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు లగడపాటి రాజ్ గోపాల్ విజయవాడ ఎంపీగా పని చేసారు.
Advertisement
రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన లోక్ సభలో సమైక్యాంధ్ర కోసం పోరాడారు. రాష్ట్రము విడిపోతే.. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని అన్నారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో.. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఆయన్ను పలుసార్లు కలిశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబే గెలుస్తారు అంటూ జోస్యం చెప్పారు. కానీ అది జరగలేదు.
Advertisement
దీనితో ఆయన సర్వేలకు కూడా దూరం అయ్యారు. లగడపాటి ఎంపీగా చేసినప్పటి సమయంలో ఆయన అనుచరులు విజయవాడలో సమావేశం అయ్యారు. వారంతా లగడపాటిని తిరిగి రాజకీయాల్లోకి రవళి అంటూ ఆయన్ను కోరారు. మొదట లగడపాటి రాజకీయాల్లోకి రావడానికి ఒప్పుకోలేదు. కానీ, కొందరు ఆయన్ను రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి.. మూడు లోక్ సభ సీట్లను కూడ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ లగడపాటి సిద్ధం అయితే.. ఆయన విజయవాడ, గుంటూరు, ఏలూరుల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వార్తలను టీడీపీ కానీ, లగడపాటి కానీ ధృవీకరించలేదు.
సలార్ రివ్యూ లీక్ ! సినిమాపై ఎలాంటి టాక్ వచ్చిందో తెలుసా ?
వైస్సార్ ని ఎందుకు గొప్ప లీడర్ అంటారు ? ఈ ఒక్కసంఘటన సరిపోదా ! సలాం కొట్టాల్సిందే !
26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన యశస్వినీ రెడ్డి ఎవరో తెలుసా ? బ్యాక్ గ్రౌండ్ ఇదే !