Advertisement
కాలం మారిన ప్రేమ పట్ల, ప్రేమికుల పట్ల, ప్రేమ లేఖల పట్ల ఉండే క్రేజ్ మాత్రం ఎప్పటికీ మారదు. ఇప్పుడంటే సోషల్ మీడియాలు, స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి కానీ.. ఒకప్పుడు ప్రేమికులు ఒకరినొకరు మాట్లాడుకోవాలంటే.. ఈ ప్రేమ లేఖలు మాత్రమే దిక్కు. వారి ప్రేమను వ్యక్త పరచడం కోసం అనేక ప్రేమలేఖలు రాసుకునేవారు. వాటిని పంపించడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేసేవారు. ఈ ప్రేమలేఖలు చాలానే క్రేజ్ ఉంది. దాదాపు 250 సంవత్సరాల క్రితం రాసిన ఓ ప్రేమ లేఖల కట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కట్టాలో వందకి పైగా ప్రేమ లేఖలు ఉన్నాయి. వీటిని కనీసం ఓపెన్ చేయలేదు కూడా.
Advertisement
. బ్రిటన్ – ఫ్రాన్స్ దేశాల మధ్య ఏడేళ్ల పాటు యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ సమయంలోనే ఈ లేఖలను రాసి ఉంటారని తెలుస్తోంది. ఫ్రాన్స్ నావికాదళంలో పని చేసే సైనికులకు ఈ ప్రేమ లేఖలు అందినట్లు తెలుస్తోంది. అయితే… బ్రిటిష్ నావికా దళం ఈ లేఖలను స్వాధీనం చేసుకుంది. సైనికుల కోసమే ఈ ప్రేమ లేఖలు రాసినప్పటికీ.. ఇవి వారిని చేరలేదు.
Advertisement
అసలు వీటిని ఓపెన్ చెయ్యలేదు కూడా. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ లెటర్స్ ని కనుగొన్నట్లు తెలుస్తోంది. ఈ లేఖలు ఓపెన్ చేసి వాటిని చదవాలని ట్రై చేశారట. మెసేజ్ లాగా అందులో రాసి ఉన్నట్లు తెలుస్తోంది. నీ గురించి రాస్తూ రాత్రంతా గడిపేస్తాను.. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ ఉంది.. అంటూ ఆ లెటర్స్ లో రాసి ఉందట. రోజు వారి జీవితంలోని సంఘటనల గురించి, ఖర్చుల గురించి కూడా ఈ లెటర్స్ లో రాసి ఉందట. తమ వ్యక్తుల కోసం తమలో ఉన్న ప్రేమని చూపిస్తూ ఈ లేఖలను రాసారు. కానీ దురదృష్టం ఏమిటంటే.. ఈ లేఖలు వారిని చేరలేదు. ఆ సైనికులకు ఈ లేఖలు అంది ఉంటె బాగుండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read More:
ప్రభుత్వం మారగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా? అసలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారా ?
ప్రశాంత్ నీల్ సినిమాలు… డార్క్ కలర్ లో ఉండడానికి కారణం ఏమిటి..?
ఈ తప్పులు చేస్తే భర్తను ఏ భార్యా అస్సలు క్షమించదు.. పొరపాటున కూడా ఇలా చెయ్యకండి..!