Advertisement
ఐపీఎల్ ఫ్రాంచైజ్ లు క్రికెటర్లని వాళ్ల జట్టు లోకి తీసుకోవాలని కోట్లని పెట్టి కొంటున్నారు ఐపీఎల్ వేలంలో స్టార్క్ కమిన్స్ వంటి ఆసిస్ ప్లేయర్లని 20 కోట్లకు పైగా పెట్టి కొన్నారు. యూపీకి చెందిన సమీర్ రిజ్వా కోసం చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్లు ఖర్చు చేసింది. జార్ఖండ్ కి చెందిన కుషాగ్ర అనే వికెట్ కీపర్ బాటర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు కోట్లు చేసింది జార్ఖండ్ కి చెందిన రాబిన్ రాబిన్ మింజ్ అనే అతన్ని చెన్నై, ముంబై, సన్‌రైజర్స్, గుజరాత్ వంటి ఫ్రాంచైజ్ లు పోటీపడి చివరికి టైటాన్స్ రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది.
Advertisement
ఇండియన్ పోలార్డ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మింజ్. అయితే నిజానికి అంతకు మించి ధర పలికేదే. కానీ వేలం చివర్లో పేరు ఉండడంతో అప్పటికే ఫ్రాంచైజీ దగ్గర డబ్బులు అయిపోవడం వలన ఇంత ధరకే కొనుగోలు చేసారు. లిమిట్ అయిపోయేదాకా ఫ్రాంచైజీలు ట్రై చేసారు. సన్‌రైజర్స్ పర్స్‌లో రూ.3.4 కోట్లు వరకూ అతడి కోసం వేలంలో పాల్గొంది. లిమిట్ అయిపోవడంతో తప్పుకుంది. రూ.3.6 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
Advertisement
ఇతను గుమ్లా జిల్లాలోని గిరిజన తెగకు చెందిన వ్యక్తి. మింజ్ హార్డ్ హిట్టర్. ఈ ఏడాది ఆగస్టులో యూకే లో జరిగిన ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్ కి అతన్ని ముంబై ఇండియన్స్ ఎంపిక చేసింది. క్లబ్ క్రికెట్లో 140 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. ఇది ఇలా ఉంటే, 2023 వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు అతన్ని ట్రయల్స్ కోసం పిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ట్రయల్స్‌కు మాత్రమే వెళ్ళాడు. సెలక్ట్ అవ్వలేదు. దీంతో ఐపీఎల్ 2023 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!