Advertisement
Salaar Telugu Review: ప్రశాంత్ నీల్ రచించి దర్శకత్వం వహించిన, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా సలార్. ఎంతో మంది మూవీ లవర్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది మరియు మొదటిది సలార్ పార్ట్ 1. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏమి టాక్ నడుస్తుందో చూద్దాం.
Advertisement
స్టోరీ:
సలార్ పార్ట్ 1 అనేది ఖాన్సార్ అనే కాల్పనిక రాజ్యం నేపథ్యంలో సాగే కథ. ఇది చిన్ననాటి నుండి ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ, వారు పెద్ద శత్రువులుగా మారారు. కథ చాలా పెద్దది, రచయిత మరియు దర్శకుడు దానిని రెండు భాగాలుగా విడదీసి రిలీజ్ చేస్తున్నారు. కథలోకి వెళ్తే.. ఖాన్సార్ అనే సామ్రాజ్యాన్ని అందరు సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అందుకోసం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. వారి రాజ్ మన్నార్ ఒకరు. ఇతనికి దేవా ప్రాణ స్నేహితుడు. రాజ్ మన్నార్ కూడా ఖాన్సార్ సామ్రాజ్యం కోసం ప్రయత్నించి ఓడిపోతాడు. అయితే.. ఈ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి దేవా సాయం కోరతాడు.
రాజమన్నార్ ఓడిపోవడం, దేవా ఎంట్రీ ఇవ్వడం ఇవన్నీ సినిమాలో చాలా హైలైట్ అవుతాయి. దేవా సాయంతో రాజ్ మన్నార్ ఖాన్సార్ సామ్రాజ్యాన్ని గెలుస్తాడు. అయితే.. ఈ సామ్రాజ్యం కోసమే రాజ్ మన్నార్ తనని వాడుకున్నాడు.. తనని మోసం చేసాడు అన్న సంగతి దేవాకు అర్ధం అవుతుంది. దానితో అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? తిరిగి ఖాన్సార్ ను ఎలా సొంతం చేసుకున్నాడు అనేది మిగిలిన కథ. దీనినే రెండు పార్ట్శ్ గా తీశారు. ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర కూడా చాల కీలకమైనది.
స్టోరీ విషయానికి వచ్చేస్తే… తండ్రికి తెలియకుండా ఆద్య (శృతి హాసన్) ఇండియా వస్తుంది. ఖాన్సార్ మనుషుల నుంచి ముప్పు ఉంటుంది. రక్షణ కోసం బిలాల్ (మైమ్ గోపి)కి ఫోన్ చేస్తారు. దేవా (ప్రభాస్) సూచనలను పాటిస్తూ ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి తీసుకువెళతాడు. దేవా బొగ్గు గనుల్లో పని చేస్తుంటాడు. తల్లి (ఈశ్వరీ రావు) ఆ ఊరిలో పిల్లలకు చదువు చెప్తుంటారు. కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా కూడా ఆమెకి చాలా భయం. ఆవిడ ఎందుకు అలా ఉంటుంది…? ఏడేళ్ళ క్రితం ఏం అయ్యింది..? ఖాన్సార్ కర్త (రాజు) రాజ మన్నార్ (జగపతి బాబు) తర్వాత ఆ కుర్చీ పై కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో రాజ మన్నార్ రెండో భార్య కొడుకు, తన బాల్య స్నేహితుడు వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)కి సపోర్ట్ గా ఉండాల్సిన దేవా ఏం చేశాడు..? ఇదే కథ.
Advertisement
ఈ సినిమాలో హీరోకు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు అదిరిపోయాయి. మాస్ జనాలకు ఫుల్ మీల్స్ ఏ. మూవీ కథ మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది. ప్రభాస్ కటౌట్ అలానే పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ అస్సలు ఏమీ మిస్ చేయలేదు. సూపర్ గా ప్రభాస్ ని చూపించాడు. కథ & కథనం విషయంలో డిజప్పాయింట్ అయితే చేశారు. అలానే ‘సలార్’ సెకండాఫ్ కెజియప్ సినిమాకు మధ్య లింక్ ఉన్నట్టు కనపడుతుంది. క్యారెక్టర్లు కొత్తవి అయినా కూడా, ఆ స్టోరీ కి చాలా దగ్గరగా ఉంటుంది. అలానే, రెండో పార్టు కోసం కథ ని దాచి పెట్టారు.
బయట ప్రపంచాన్ని లోపలికి రానివ్వకుండా శత్రు దుర్బేధ్యమైన కోటను తండ్రి నిర్మిస్తాడు. కొడుకులతో పాటు శత్రువులు కూడా కన్నేస్తారు. అయితే బయట నుంచి లోపలకు వచ్చిన ఒకడు అందరినీ చిత్తు చేస్తాడు. అయితే ఇందులో చాలా సీన్స్ కెజియఫ్ 1ను తలపించాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కెజియఫ్ నుంచి వేరు చేసింది. లేకపోతే సేమ్ కెజియఫ్ లానే ఉండేది. యాక్షన్ హైలైట్ అవుతుంది అలానే ఎమోషన్స్ కూడా బావున్నాయి. అయితే పాటలు ఆశించిన స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం పరవాలేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్. కెజియఫ్ రేంజ్ లో వున్నాయి. ప్రభాస్ రోల్ అలానే ఆ తర్వాత ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్:
శృతి హాసన్, ప్రభాస్
ప్రశాంత్ నీల్ డైరెక్షన్
ఎమోషన్స్
క్లైమాక్స్
అక్కడక్కడా పెట్టిన ఆసక్తికరమైన సీన్స్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
సెకండ్ పార్ట్ కోసం వదిలేసిన ట్విస్ట్స్
రేటింగ్: 2.75/5
ఇక ఈ సినిమా చూసిన ఫాన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ కాదు దానెమ్మ మొగడు అంటూ కామెంట్స్ చేస్తూ, పోస్టులు పెడుతున్నారు.
వీటిని కూడా చదవండి:
- సలార్ మూవీ లో పవర్ఫుల్ డైలాగ్స్ ! Salaar Movie Powerful Dialogues
- సలార్ సినిమా ఈ ఓట్ లోకి వస్తుంది !Salaar Movie OTT Details
భారీ అంచనాలతో తెలుగుతో పాటుగా కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం లో కూడా విడుదల అయ్యింది. ఇటు హైదరాబాద్ వంటి నగరాలలో అర్ద రాత్రి 1 నుంచే షోస్ మొదలయ్యాయి. ఇక ప్రేక్షకుల స్పందన చూస్తే “ఆహా ఇది ఊచకోత భయ్యా” ప్రభాస్ కట్ అవుట్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. కేజీఎఫ్ మించి ఉంది అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేసారు.
Coming Soon