Advertisement
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడలో తీసిన కెజిఎఫ్ సినిమాతో మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆయన తన కెరీర్ ను కన్నడలోనే ప్రారంభించారు. అయితే.. ఆయన ప్రస్తుతం కన్నడ పరిశ్రమని వదిలేసారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనికి కారణం ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
Advertisement
కన్నడలో “ఉగ్రం” సినిమాతో ప్రశాంత్ తన సినిమా కెరీర్ ను ప్రారంభించారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో కెజిఎఫ్ తీశారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఆయన సక్సెస్ లు అందుకుంటున్నారు.
కెజిఎఫ్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయన తెలుగు హీరోల దృష్టిని కూడా ఆకర్షించారు. తనకి అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ప్రభాస్ తో సలార్ సినిమాను కూడా తీశారు. ఈరోజు రిలీజ్ అయిన సలార్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆయన తెలుగు హీరోలతోనే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో ఒక సినిమా, రామ్ చరణ్ తో మరొక సినిమాను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
ఇది ఇలా ఉంటె.. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై కన్నడ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కన్నడ సినిమాలో డైరెక్టర్ గా పరిచయం అయిన ప్రశాంత్ నీల్ అక్కడ సక్సెస్ వచ్చాక.. తెలుగు సినిమా హీరోలతో సినిమాలు తీస్తున్నారు అంటూ విమర్శలు ఎత్తుతున్నారు. ప్రశాంత్ నీల్ ఎందుకు కన్నడ పరిశ్రమని వదిలేసారు? అన్న ప్రశ్న సర్వత్రా ఉదయిస్తోంది. ఈ విషయానికే ఆయనే ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. కన్నడ ఇండస్ట్రీతో పోలిస్తే.. తెలుగు ఇండస్ట్రీ పెద్దది.
ఇక్కడి హీరోలతో సినిమాలు తీస్తే అవి ఎక్కువ రేంజ్ కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే తెలుగు ఇండస్ట్రీని ఎంచుకున్నానని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ ని ఎప్పటికీ మర్చిపోనని.. ఆ ఇండస్ట్రీ వలనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెబుతున్నారు. అలాగే.. ప్రొడ్యూసర్స్ కూడా తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తారని.. కానీ కన్నడ ఇండస్ట్రీలో అటువంటి పరిస్థితి లేదని తెలిపారు.
read more:
Dunki Movie Review : షారుక్ ఖాన్ డంకీ సినిమాతో షారుఖ్ హిట్ కొట్టేసారా..? కథ, రివ్యూ & రేటింగ్..!
Rinku Singh: బీసీసీఐ తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం రింకు సింగ్ కి ఇంత నష్టాన్నిచేసిందంటే ?
Salaar Review and Rating: సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ.. ప్రభాస్ ఇరగదీశాడా?