Advertisement
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ చిత్రం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఇది హిట్ టాక్ తెచ్చుకుంది.కానీ కేజీఎఫ్ రేంజ్ లో మాత్రం సెన్సేషనల్ హిట్ టాక్ అందుకోలేకపోయిందనే చెప్పాలి.
Advertisement
ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ యాక్షన్ సీన్స్ అదరగొట్టాయి కానీ సినిమా ఆధ్యాంతం అద్భుతంగా సాగలేదు.ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో కొన్ని మైనస్లు ఉన్నాయి.ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మూడు బ్లెండర్ మిస్టేక్స్ చేశాడు. ఆ మైనస్లు ఈ సినిమాలో లేకుంటే సలార్ జవాన్ మూవీ రేంజ్ లో రెస్పాన్స్ అందుకునేది. ఇంతకు ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ప్రభాస్ సినిమా అంటేనే ప్రేక్షకులు యాక్షన్ సీన్లను ఇష్టపడుతుంటారు. ఈ సినిమాకి యాక్షన్ సీన్లు ఆయువు పట్టు అనే చెప్పాలి. అయితే ఆ యాక్షన్ సన్నివేశాలను కొన్ని చోట్లా ఆశించిన స్థాయిలో ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ విఫలమయ్యాడు. ప్రబాస్ కి ఉన్న ఇమేజ్ వల్లనే లేక ప్రెజర్ వల్లనో కానీ.. అతడు ఆ సన్నివేశాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. కొన్ని చోట్ల అనవసరంగా మరింత వైలెన్స్ సన్నివేశాలను జొప్పించాడు.
సినిమాకే మొదటి మిస్టేక్ అయ్యాయి. అయితే క్యాన్సర్ స్టోరీ, వంశాల గురించి చెప్పే విషయంలో కూడా స్పష్టత లోపించింది. వీటిని ప్రశాంత్ నీల్ చాలా వేగంగా చెప్పుకుంటూ పోయాడు. దీంతో ఆడియన్స్ కి మెయిన్ పాయింట్ మిస్ కావడం జరిగింది. చివరికీ ప్రభాస్ పాత్ర విషయంలో కూడా ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. మొత్తం మీద క్యారెక్టర్ గురించి సరిగ్గా చూపించడంలో ప్రశాంత్ ఫెయిల్ అయ్యాడు. అది కూడా పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. సినిమా రిలీజ్ కి ముందు ఇవన్నీ చెక్ చేసుకొని చేయాల్సిన కరెక్షన్స్ చేసి ఉంటే.. ఈ సినిమా ఇంకా పర్ ఫెక్ట్ గా వచ్చి ఉండేది.