Advertisement
తెలంగాణ రాష్ట్ర రాజకీయా నాయకుడు, బిఆర్ఎస్ పార్టీ కీలక అభ్యర్థి హరీష్ రావు గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగానే తెలుసు. 3 జూన్ 1972 లో జన్మించిన తానేరు హరీష్ రావు 08 సెప్టెంబర్ 2019 నుండి 02 డిసెంబర్ 2023 వరకు తెలంగాణ వైద్య – ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అతను 2004 నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. . కేవలం నలభై రెండేళ్ల వయసులో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత హరీష్ రావుది.
Advertisement
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. పార్టీ అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలు తిరుగుతూ.. అందరికి మద్దతు ఇస్తూ ప్రచారం చేసే హరీష్ రావు అందరికి సుపరిచితుడే కానీ, ఆయన పోటీ చేసే సిద్దిపేటలో ఆయనకు మద్దతు ఇస్తూ.. ఆయన తరపున ప్రచారం చేస్తూ వస్తున్న ఆయన భార్య శ్రీనిత రావు గారి గురించి ఎవరికీ తెలియదు. హరీష్ రావు, శ్రీనిత దంపతులకు ఇద్దరు సంతానం. వీరి పెద్ద కుమారుడు అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసారు. అక్కడ గ్లోబల్ అవార్డు కూడా అందుకున్న ఆయన.. ప్రస్తుతం న్యూ యార్క్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేస్తున్నారు.
Advertisement
హరీష్ రావు గారి కుమార్తె కూడా ప్రస్తుతం అమెరికాలో లెవెన్త్ గ్రేడ్ చదువుతున్నారు. అంటే ఇండియా లెక్కల ప్రకారం ఇంటర్మీడియట్ చదువుతున్నారు. చిన్న వయసులోనే ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న హరీష్ రావు గారి కుమార్తె వైష్ణవి న్యూ యార్క్ యూనివర్సిటీలో బిజినెస్ మానేజ్మెంట్ చదవాలని అనుకుంటున్నారు. అయితే.. రాజకీయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే హరీష్ రావు గారు.. కుటుంబానికి దూరం అనే చెప్పాలి. ఈ విషయాన్నీ స్వయంగా హరీష్ రావు గారి భార్య శ్రీనిత గారే చెప్పారు. ఆయనకు సిద్ధిపేట ప్రజలంటే ఇష్టమని.. నాకంటే, పిల్లల కంటే కూడా సిద్ధిపేటనే ఎక్కువగా ఇష్టపడతారని.. అందుకే ఆయనని ఆనందంగా ఉండనివ్వడం కోసమే మేము కూడా ఆలోచిస్తామని తెలిపారు. అలాగే ఎప్పుడైనా హరీష్ రావు ఇంటికి త్వరగా వస్తే.. ఆయన కుమారుడు మా నాన్న కూడా ఇంటికి వస్తున్నారు అంటూ కామెడీ చేస్తారట. అన్ని ప్రాంతాల్లో పర్యటించే ఆయన తిండి కూడా తినరట. వారానికి రెండు రోజులు మాత్రమే ఆయన ఇంట్లో తింటూ ఉంటారట. ఈ విషయమై శ్రీనిత గారు కూడా మందలిస్తూ ఉంటారట.
శ్రీనిత గారు కేవలం భర్త ద్వారా మాత్రమే పేరు తెచ్చుకోవడం కాకుండా.. సొంతంగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేయడం, వ్యాపారాలు చేయడం వంటివి చేస్తున్నారు. 2021 లో పాల వ్యాపారాన్ని ప్రారంభించిన శ్రీనిత గారు సొంతంగా ఎదుగుతూ వచ్చారు. అలాగే.. సిద్ధిపేట లో హరీష్ రావు గారి తరపున ప్రచారం చేస్తూ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. పాల వ్యాపారంలోకి రాకముందు బోటీక్ లు నడిపిన శ్రీనిత గారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు.
Watch Video: