Advertisement
భారతీయ రైలు భోగి లపై కొన్ని గుర్తులను మనం గమనించే ఉంటాము. అలాగే రైలు బోగి చివరి ఒక గుర్తును కూడా చూసే ఉంటాము. అవి సాధాసీదా గుర్తులు కావట వాటికి ఒక అర్థం ఉంది. రైలు భోగి లపై అలాంటి గుర్తులు మరికొన్ని కూడా ఉంటాయి. పసుపు రంగు గీతలు మరియు తెలుపు రంగు గీతలు ఇలా ఇంకొన్ని ఉంటాయి. ఆ గీతలకి కూడా ఒక అర్థం ఉందని రైల్వే అధికారులు అంటున్నారు. మనం వాటిని అంతగా గమనించకపోయినా ఒక్కసారి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏ భోగి దేనికి సంబంధించిందో మనం గుర్తుపట్టవచ్చు. ఇలాంటిదే ఇప్పుడు రైలు భోగి లపై ఉన్న కొన్ని గుర్తులు గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Advertisement
Advertisement
1859 ఏప్రిల్ 16న ఇండియాలో ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి రైలు, ముంబై నుంచి ఠాణే 33 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గంలో పరుగులు పెట్టింది. అయితే అప్పటి నుంచి రైళ్లకు పై భాగంలో పసుపు, తెలుపు, ఆకుపచ్చ గీతలు గీస్తున్నారు. రైళ్లలో ప్రతి అంశానికి, ప్రతి సైన్ బోర్డు కు, ప్రతి వస్తువుకు ఒక కారణం ఉంటుంది. అలాగే ఈ గీతలపై కూడా. మీకు ఈ గీతల వెనుక నిజాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఇండియాలోనే ఎక్స్ప్రెస్, హై స్పీడ్ రైళ్లకు బ్లూ కలర్ ఉంటుంది. ఈ రైళ్లకు ఉండే విండోల పై కనిపించే వైట్ లైన్ అర్థం ఏంటంటే ఆ కోచ్ లు రిజర్వు కానీ కోచ్ లు అని అర్థం. అందువల్ల ఆ కోచ్ లో ఎవరైనా కూర్చొని ప్రయాణించవచ్చు. ఇక పసుపు రంగు గీతలు ఉంటే దాని అర్థం, ఆ కోచ్ స్పెషల్ గా దివ్యాంగులు మరియు అనారోగ్యంతో ఉండే వారి కోసం కేటాయించారని అర్థం. చివరగా గ్రీన్, బ్లాక్ లైన్స్ కనుక ఉంటే, ఆ కోచ్లు ప్రత్యేకంగా మహిళల కోసం అని అర్థం.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?