Advertisement
తిరుమల శ్రీవారి లీలలు లెక్కలేనన్ని ఉంటాయి. అలాగే.. తిరుమలకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు కూడా ప్రచారంలో ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తిరుమల శ్రీవారి సంపదని కాపాడడానికి ప్రత్యేక దేవతలు ఉంటారట. వారి గురించి పూర్తిగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. ఓ ఆలయాన్ని నిర్మించాలంటే.. అందుకు ఎన్నో పూజా విధానాలు ఉంటాయి. ఎన్నో నియమాలను అనుసరించి ఆలయ నిర్మాణాన్ని చేస్తుంటారు.
Advertisement
ఈ నియమాలని ఆలయ ఆగమ శాస్త్ర నియమాలు అని అంటారు. ఈ ఆగమశాస్త్రాన్ని అనుసరించే ఆలయ ఏర్పాటుకి అనువైన ప్రాంతాన్ని, పరివార దేవతలను పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారికి పూజలు, నివేదనలు జరుగుతూ ఉంటాయి. పరివార దేవతలను కూడా ఆగమ శాస్త్ర ప్రకారమే పూజిస్తారు. శ్రీవారి ఆలయ ద్వారం వద్ద అందరు కాళ్ళు కడుక్కోవడంలోనే బిజీ అయిపోతారు. కానీ అక్కడే చెరోవైపు రెండు చిన్న విగ్రహాలు ఉంటాయి.
Advertisement
వీటిని ఎవ్వరూ గమనించి ఉండరు. ఈ విగ్రహాలను కూడా ఆగమశాస్త్రం ప్రకారమే ఏర్పాటు చేసారు. వీటిని ఎందుకు ఏర్పాటు చేసారు? అక్కడే ఎందుకు ప్రతిష్టించారు? అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి తిరుమలకు రోజు లక్షల మందిలో ప్రజలు దర్శనానికి వస్తూ ఉంటారు. సంపన్న దేవుళ్లలో వెంకన్న ఫస్ట్ లోనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఆయనకు ప్రతి నిత్యం ఒక్క హుండీ ద్వారానే మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏడాదికి కనీసం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే.. ఈ సంపదని కాపాడే దేవతలు ద్వారబంధం వద్ద ప్రతిష్టించబడిన దేవతలేనని ఆగమం చెబుతోంది. ఈ సంపదని మేనేజ్ చేయడం కోసమే టీటీడీ, పాలకమండలి ఏర్పాటైంది. ద్వార బంధం వద్ద ఉన్న ఆ ఇద్దరు దేవతలను శంకనిధి, పద్మనిధి అని పిలుస్తారు. వీరిద్దరే శ్రీవారి సంపదని నిత్యం రక్షిస్తూ ఉంటారట.
Read More:
డాక్టర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా.. ఈ సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అంటారు.. కానీ తన భర్త?
అన్నిట్లో టాపర్ గా ఉన్న స్మితా సబర్వాల్ గారు ఆ సబ్జెక్టులో మాత్రం అన్నిసార్లు ఫెయిల్ అయ్యారా?