Advertisement
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “సలార్” సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ క్రమంలో సలార్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఎప్పుడు భోజనం చేసినా.. కేవలం గొడ్డు కారంతో మాత్రమే భోజనం చేసినట్లు చూపించారు.
Advertisement
అసలు ఇలా ప్రభాస్ కేవలం గొడ్డుకారం మాత్రమే తినేలా చూపించడం వెనుక డైరెక్టర్ అసలు ఉద్దేశ్యం ఏమిటీ? అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే.. ప్రభాస్ ని ఇలా చూపించడం వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొందరు ఎక్కువ కోపంగా ఉండేవారిని చూసి కారం తగ్గించి తిను.. కోపం తగ్గుతుంది అని చెబుతూ ఉంటారు. సహజంగానే కోపిష్టి స్వభావులు ఎక్కువ కారం తినే అలవాటుతో ఉంటారు. ఎవరికైనా పౌరుషం, కోపం ఎక్కువ స్థాయిలో ఉన్నాయి అంటే వారు కారం ఎక్కువ తింటుంటారు అని అనుకోవడం సాధారణం అయిపొయింది.
Advertisement
కానీ.. ప్రభాస్ మాత్రం శాంతంగా ఉండడం కోసం గొడ్డు కారం తింటుంటారు. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమాలో ఒక చిన్న సంఘటన ఉంటుంది. ఒక చిన్న పాప పుట్టిన రోజు సందర్భంగా కేక్ తీసుకుని ప్రభాస్ వద్దకు వస్తుంది. చాక్ చేతికి ఇచ్చి కేక్ కట్ చేయమని చెప్తుంది. ఆ టైం లో వెంటనే ప్రభాస్ తల్లి వచ్చి.. ముందు ఆ కత్తి ఇచ్చేయ్ దేవా అంటూ ప్రభాస్ చేతిలోంచి కత్తి తీసుకుంటుంది. అది ప్లాస్టిక్ కత్తి అయినా సరే.. కత్తి చేతిలో ఉంటె ప్రభాస్ హత్యలు చేస్తాడేమో అని తల్లి భయపడుతుంది అన్నదానికి సింబాలిక్ గా ఈ సన్నివేశాన్ని చూపారు. అందుకే ఇంట్లో కనీసం కూరగాయల కత్తి కూడా లేకుండా ఆమె తల్లి ఉంచుతుంది. దీనితో.. కూరలు కూడా చేయలేక.. గొడ్డు కారం మాత్రమే వేసి పెడుతుంది అన్న విషయాన్నీ ప్రశాంత్ నీల్ పరోక్షంగా చూపారు. ఇది చూసిన నెటిజన్స్ అబ్బా.. ఏమి ఎలివేషన్ అంటూ ప్రశాంత్ నీల్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.