Advertisement
ఇటీవల ఊహించని విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ టీచర్, ఓ స్టూడెంట్ రొమాంటిక్ గా తీసుకున్న ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్టడీ టూర్ లో భాగంగా ఓ టీచర్.. టెన్త్ క్లాస్ చదువుతున్న తన స్టూడెంట్ తో ఫోటోలు తీసుకుంది. మాములుగా ఫోటోలు తీసుకుంటే అభ్యంతరాలు ఏమీ ఉండవు కానీ.. వారిద్దరూ రొమాంటిక్ ఫోజులిస్తూ ఫోటోలు తీసుకోవడమే పెను దుమారానికి తెర లేపింది. ప్రేమికుల్లాగా ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ ఫోటోలు తీసుకోవడం నెటిజన్స్ ను ఆశ్చర్యంలో పడేస్తోంది.
Advertisement
కర్ణాటక లోని చిక్ బళ్లాపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో పాఠశాల యాజమాన్యం ఆ టీచర్ పై వెంటనే చర్యలు తీసుకుంది. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అధికారులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. టీచర్ పేరు ఆర్. పుష్పలత. ఆమె మురుగమల్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె స్టూడెంట్ తో శృతి మించి ప్రవర్తించారు. ప్రేమికులలాగా స్టూడెంట్ ని హాగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం.. సదరు స్టూడెంట్ కూడా ఆమెను ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
Advertisement
Where are we heading as a society ?
Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J
— Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజన్స్ ఆ టీచర్ పై చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్స్ చేసారు. మైనర్ విద్యార్థితో ఆ ఫోజులివ్వడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఈ ఫోటో షూట్ పై ఆ బాలుడి తల్లితండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ టీచర్ ప్రవర్తనపై విచారణ జరిపించాలి అని కోరుతూ.. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి రిపోర్ట్ చేసారు.
Read More:
తరుణ్, సందీప్ మొదలైన టాలీవుడ్ హీరో కనపడకుండా పోవడానికి కారణం ఏమిటి..? ఇప్పుడేం చేస్తున్నారు..?
ఆడవారు ఈ విషయాలని డైరెక్ట్ గా చెప్పారట ! మరెలా తెలియ చేస్తారంటే ?