Advertisement
Hanu Man (Hanuman) Review in Telugu: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ హీరో సినిమా “హనుమాన్” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సజ్జ, అమృత అయ్యర్, మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య మరియు పలువురు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
Advertisement
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచం డల్ గా సాగుతుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ ప్రేక్షకుల్ని అలరిస్తుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్లతో పోటీ పడుతోంది. ఇలాంటి టైం లో సెకండ్ హాఫ్ స్లో గా ఉంది అన్న టాక్ రావడం కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
కాస్ట్ అండ్ క్రూ:
నటినటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్, మీనాక్షి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కే నిరంజన్ రెడ్డి
సంగీతం: హరి గౌర, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
ఎడిటర్: సాయిబాబు తలారి
Advertisement
స్టోరీ:
హనుమంతు గా నటించిన తేజ సజ్జా హనుమంతుని శక్తులను పొందుతాడు. ఓ నార్మల్ అబ్బాయి అయిన హనుమంతు ఈ శక్తులను ఎందుకు పొందాడు? అతని అక్క అంజమ్మ ఎవరు? అంజనాద్రి అనే ప్రదేశం ఏమిటి? ఈ స్థలం కోసం హనుమంతు ఎందుకు యుద్ధం చేసాడు? యుద్ధం చేసి గెలిచాడా? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
కథ
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది అనే టాక్ ఈ సినిమాకి మైనస్ పాయింట్ అవ్వచ్చు.
రివ్యూ: హను-మాన్ ఒక ఆకర్షణీయమైన సూపర్ హీరో చిత్రం. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఆఖరి అరగంట చాలా హై లో సన్నివేశాలు ఉంటాయి. ఆ సమయంలో వచ్చిన కామెడీ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. పీక్స్ లో ఉండే సన్నివేశాలు, కామెడీ సీన్స్ ఈ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. కథాంశం సుపరిచితమే అయినా.. నేరేషన్ ను చేసే విషయంలో ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల నాడి కరెక్ట్ గా పట్టుకున్నాడనే చెప్పొచ్చు. తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్ తదితరులు బాగా చేశారు. సినిమా కొన్ని సన్నివేశాలలో లాగ్ చేసినట్లు అనిపించినా.. మొత్తం మీద ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది ఈ సినిమా.
రేటింగ్: 3.5/5