Advertisement
ప్రతి స్త్రీ తనను అర్థం చేసుకునే, ప్రేమించే మరియు అదే సమయంలో తన పట్ల శ్రద్ధ వహించే వ్యక్తిని కోరుకుంటుంది. మరోవైపు, పురుషులు వాస్తవికంగా, నమ్మకంగా మరియు పరిణతి చెందిన అమ్మాయిల కోసం చూస్తారు. దాదాపు దశాబ్దం కాలం కంటే ముందు నుంచే అబ్బాయిలు తమకంటే పెద్దగా ఉన్నా, మెచూరిటీ ఉన్న అమ్మాయిలతో రిలేషన్ ని ఏర్పరుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారు మరింత బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు. అయితే.. అబ్బాయి వయసు కంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉంటె ఆ బంధం నిలబడుతుందా? అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.
Advertisement
గత కొన్ని దశాబ్దాలుగా.. స్త్రీకి పురుషుడు రక్షణ కల్పిస్తాడు అనే ఫీలింగ్ మీదే పెళ్లి అనే బంధం ఉండేది. కానీ, జనరేషన్ మారుతున్న కొద్దీ ఈ ఫీలింగ్స్ ను, తరతరాలుగా వస్తున్నా అవగాహనను క్వశ్చన్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురుషులు కూడా తమ కంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిలనే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే.. దీని వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా తెలుసుకోవలసి ఉంటుంది. ఒకప్పుడు పదిహేను, పదహారు సంవత్సరాల వ్యత్యాసం ఉన్నా అమ్మాయిలు తన కంటే వయసులో పెద్ద అయిన అబ్బాయిని పెళ్లి చేసుకునేవారు.
Advertisement
ఆ తరువాత ఈ వ్యత్యాసం తొమ్మిది నుంచి పది సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు ఐదు సంవత్సరాల గ్యాప్ ఉన్నా చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లేదు. అమ్మాయిలు తమ కంటే వయసులో ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే.. ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోరుకున్నట్లు కేర్ చేయగలుగుతాడు. కానీ, వయసులో తక్కువ వయసు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. అతను అమ్మాయి అంచనాలకు తగ్గట్లు లేకపోతే జీవితాంతం డిజప్పోయింట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే.. చిన్న వయసులో ఉన్న అతడిని కేర్ చేస్తూ, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటూ, ఇంటి బాధ్యతలు కూడా సొంతంగానే మొయ్యాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ ఒత్తిడిని కలుగ చేసి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అలాగే.. ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని తక్కువ వయసు ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకుంటే.. ఆ అమ్మాయికి ఆయుక్షీణం అని అంటుంటారు. భర్త చనిపోయినా భార్య పిల్లలతో బ్రతకగలదు. కానీ, భార్య చనిపోతే ఆ భర్త ఎక్కువ కాలం బ్రతకలేదు. అందుకే భర్త వయసు కంటే భార్య వయసు తక్కువ ఉండాలి అన్న నియమాన్ని పెట్టారు.
Read More:
Guntur Kaaram Review in Telugu: గుంటూరు కారం రివ్యూ మహేష్ ఇరగదీసాడుగా!