Advertisement
నందమూరి వంశం నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మరో హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈయన సీనియర్ ఎన్టీఆర్ కు స్వయానా తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు. అయితే.. ఈయన సినిమాల్లోకి రాకముందే ఈయనపై సినీ వర్గాల దృష్టి పడింది. చాలా మంది ఈయనని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తాం అంటూ ముందుకు వచ్చారు. కానీ అప్పటికే ఈయన చదువు పూర్తి కాకపోవడంతో కొంతకాలం ఆగాలంటూ త్రివిక్రమ రావు ఆపారు. ఆ తరువాత చదువు పూర్తి అయ్యాక ఈయనను మొదటిసారిగా కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసారు.
Advertisement
ఆయన డైరెక్షన్ లో వచ్చిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మొదటి సినిమా అత్తగారు స్వాగతం. ఈ సినిమాకి ఎన్టీఆర్ గారే స్వయంగా క్లాప్స్ కొట్టి పూజా కార్యక్రమాలు చేసారు. అయితే.. మొదట్లో పెదనాన అయిన ఎన్టీఆర్ గారు బాగానే ఇన్వాల్వ్ అయినా.. ఆ తరువాత ఆయన పట్టించుకోలేదని చెప్పాలి. అదే టైం లో బాలయ్య బాబుని మాత్రం ఎన్టీఆర్ ప్రోత్సహించేవారు. పత్రికల్లో ఈ విషయాలు హైలైట్ అయ్యేవి. సొంత కొడుకుని ప్రోత్సహించడం కోసమే.. తమ్ముడి కొడుకుని ఎన్టీఆర్ పట్టించుకోవట్లేదు అంటూ వార్తలు వచ్చేవి.
Advertisement
ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు. బాలకృష్ణ కు మంగమ్మ గారి శపధం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కోడి రామ కృష్ణ కళ్యాణ్ చక్రవర్తికి మాత్రం ఆ రేంజ్ సినిమాను ఇవ్వలేకపోయారు. ఆ తరువాత తలంబ్రాలు అనే సినిమాలో కూడా కళ్యాణ్ చక్రవర్తిని తీసుకున్నారు కోడి రామకృష్ణ గారు. అయితే..ఈ సినిమాలో మెయిన్ హీరోగా రాజశేఖర్ ఉన్నారు. రాజశేఖర్ నటన, వేరియేషన్స్ చూసిన తరువాత ఎవరూ కళ్యాణ్ చక్రవర్తిని గుర్తించలేదు. మామా కోడలు సవాల్, ఇంటి దొంగ, మారణ హోమం.. ఇలా వారు సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా కళ్యాణ్ చక్రవర్తి దూసుకెళ్లారు. సినిమాల్లోకి వచ్చే వరకు నిర్మాతలు వరుస కట్టారు. కానీ ఫ్లాప్స్ వచ్చేసరికి నిర్మాతలు వెనక్కి తగ్గారు. స్టార్ హీరో స్థాయి నుంచి సెకండ్ హీరో గాను, చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేయాల్సి వచ్చింది. మరో వైపు బాలయ్య కెరీర్ దూసుకెళ్తూ ఉండేది. తండ్రి చెప్పిన సినిమాలన్ని చేస్తూ మంచి కొడుకుగా ఉన్నారు కళ్యాణ్ చక్రవర్తి.
కెరీర్ మంచి పీక్స్ లో ఉండగా.. మూడేళ్లు గడిచేసరికి తమ్ముడు మరణం కళ్యాణ్ చక్రవర్తిని కృంగదీసింది. తండ్రి కూడా అదే ప్రమాదం బారిన పడ్డారు. ఆయన చావుని తప్పించుకున్న, ఆరోగ్యం బాగా పాడైంది. ఆయన పూర్తిగా బెడ్ కి పరిమితం అవడంతో.. కళ్యాణ్ చక్రవర్తి కెరీర్ కూడా నత్తనడకన సాగింది. అప్పటివరకు అన్నీ తండ్రి చూసుకునేవాడు. ఆ అండ లేకపోవడంతో ఆయన కెరీర్ కూడా అర్ధాంతరంగా ఆగింది. పెదనాన్న ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, తమ్ముడు లేకపోవడం, తండ్రి మంచాన పడడంతో అన్ని బాధ్యతలు కళ్యాణ్ చక్రవర్తి పైనే పడ్డాయి. ఎన్టీఆర్ తన సంపాదనలో కొంత తమ్ముడికి ఇవ్వడంతో.. త్రివిక్రమ రావు ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి బిజినెస్ లలో పెట్టారు. ఈ వ్యవహారాలన్నీ కళ్యాణ్ చక్రవర్తే చూసుకోవాల్సి వచ్చింది. దీనితో ఆయన సినిమా కెరీర్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.