Advertisement
త్రివిక్రమ్ అనే పేరు ముందు మాటల మాంత్రికుడు అన్న టాగ్ లైన్ ను ఆటోమాటిక్ గా యాడ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఆయన మాటలతో గారడీ చేస్తాడు కాబట్టి. అదే మార్క్ ఆయన సినిమాల్లో ప్రస్ఫూటంగా కనిపిస్తుంది. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే చాలు మొదటి రోజే థియేటర్ కి వెళ్లి చూడాలి అన్నంత సందడి ఉంటుంది. ఆయన డైరెక్షన్ లో, మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాకు కూడా ఫ్యాన్స్ అలానే ఎదురు చూసారు.
Advertisement
కానీ, మహేష్ బాబు మాస్ ఎలిమెంట్స్, మూస ధోరణి లవ్ స్టోరీ మాత్రమే ఈ సినిమాలో ఎక్కువగా కనిపించాయి. అంతే తప్ప త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎమోషన్స్ ఈ సినిమాలో కనిపించకపోయే సరికి అభిమానులు డిజప్పోయింట్ అయ్యారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ ఫేడ్ అవుట్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను ఓ రచయిత విషయంలో కూడా ట్రోల్ చేస్తున్నారు.
Advertisement
త్రివిక్రమ్ ఎక్కువగా యద్దనపూడి సులోచన దేవి రచనలను అనుకరిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆమె రాసిన నవలలోని పాత్రలనే స్ఫూర్తిగా తీసుకుని కథలను రాసుకుంటూ ఉంటారు. అయితే.. ఆవిడ ప్రస్తుతం లేకపోవడంతో.. త్రివిక్రమ్ కు కొత్త కథలు దొరకలేదని.. అందుకే పాత్రల చిత్రణ అలా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ రచయితే త్రివిక్రమ్ ని కాపాడారని.. ఇప్పుడు అల్లు అర్జున్ తో తీసే సినిమాతో త్రివిక్రమ్ తనను తానూ ప్రూవ్ చేసుకోకుంటే.. ఫేడ్ అయిపోయే డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కూడా ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.