Advertisement
ఏపీలో ఎన్నికలు మరో రెండు, మూడు నెలల్లో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. దివంగత మాజీ నేత, టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ మనవడిగా తెలుగుదేశం పార్టీని నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు, బాలకృష్ణతో పాటు కొందరూ తమ ఆధీనంలోనే ఉండేవిధంగా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
Advertisement
జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు, మనవళ్లు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తొలుత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించగా.. ఇక ఆ తరువాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంలో బాలయ్య కాస్త హంగామా చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చి నివాళులర్పించిన వెంటనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులను ఆదేశించారు. బాలయ్య చెప్పినట్టుగానే అనుచరులు వాటిని తొలగించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం టీడీపీకి తలనొప్పిగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలయ్యపై మండిపడుతున్నారు. బాలకృష్ణను, టీడీపీ పెద్దలను హెచ్చరిస్తూ.. ఓ లేఖను విడుదల చేశారు.
” తారక్ అన్న కోసం మేమంతా
అందరికీ నమస్కారం..
Advertisement
తమ అభిమానుల కోసం తపన పడే నటుల్లో మన తారక్ అన్న ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.. కానీ ఆయన ప్రతీ నిమిషం అవమానాలకు గురవుతుంటే ఆయన అభిమానులుగా మాకు గుండెల్లో నిప్పుల కొలిమిగా రగులుతోంది. అయినా సరే ఆయన గత నెలలో మమ్ముల్ని ఉద్దేశించి చెప్పి మాటలు.. కొద్దిగా సంయమనం పాటించండి అని.. ఇన్నాళ్లు మేము అదే సంయమనంతో ఉన్నాం.. కానీ ఇప్పుడు కుదరదు..
దేవర ఇన్నాళ్లు నీ మీద జరిగిన మానసిక దాడి చాలు.. ఇక వాళ్ళకి తెలియాలి దేవర అభిమానుల సత్తా.. మేమెంతో అభిమానంతో మా దేవర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బహిరంగంగా బాలకృష్ణ తీసేయండి.. ఇప్పుడే తీసేయండి అని అక్కడున్న టీడీపీ వాళ్లకు చెబుతుంటే.. తారక్ అన్నని ఎంతలా ద్వేషిస్తున్నారో తలచుకొని బరువెక్కిన హృదయంతో కళ్లు కన్నీటితో కారు మబ్బులు కమ్మేశాయ్..
బావ కళ్లలో ఆనందం కోసం ఆ నాడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారిన, దివంగత నందమూరి హరికృష్ణ గారిని మరణ అంచుల్లో ఉన్నా వెంటాడారు. ఇదే బాలయ్య అప్పట్లో చంద్రబాబు చెప్పులు మోస్తూ వీర విహారం చేశాడు. ఇప్పుడు తారక్ అన్నని భారీగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెబుతున్నాం. ఇన్నాళ్లు సహించాం.. త్వరలో మీ అహంకారం అణచి.. మీలోని మదాన్ని వెంటాడబోతున్నాం.. ఈసారి బ్యాలెట్ బాక్సులు భయంతో భీతెక్కుతాయి. ఆంధ్ర రాష్ట్రం తారక రాముడి అక్కడా అని చాటి చెప్పకపోతే దీంతల్లి.. ఈ సారి మీకు మాత్రం రాజకీయ బిచ్చగాళ్లను చేయడం నిశ్చయం. అందుకు ప్రతీ ఎన్టీఆర్ అభిమాని ప్రతిన పూనుతున్నాడు. మా అందరిలో ఇప్పుడు ఆగ్రహించిన ఉగ్ర నరసింహుడు ఆవహించి ఉన్నాడు.. మీ అందరినీ వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం..
జై ఎన్టీఆర్ ! జై జై ఎన్టీఆర్ !! ”
అని ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట ప్రచురించిన ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.