Advertisement
సినిమా తీసి, థియేటర్లో రిలీజ్ చేసిన తరువాత అది ఎలా ఉంటుందో? అన్న భయం ప్రతి డైరెక్టర్ నిర్మాతకి ఉంటూనే ఉంటుంది. అయితే.. పాజిటివ్ టాక్ వచ్చి ఆ సినిమా హిట్ అయితే తప్ప ఎవ్వరికీ మనశాంతి ఉండదు. ఈరోజుల్లో సినిమాకు మిక్స్డ్ టాక్ లేదా నెగటివ్ టాక్ వస్తే ఆ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ చాల తక్కువ. అయితే.. నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల అయిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
ఇటీవల రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా ఇదే కోవలోకి వస్తుంది. ఎన్ని అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా రెండవ రోజు నిలబడుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఊహించని రీతిలో ఈ సినిమా కలెక్షన్స్ కొట్టి హిట్ అయ్యింది. ఇలా గట్టెక్కేసిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
1 బిజినెస్ మాన్:
మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యింది. కానీ పోకిరి రేంజ్ లో లేదు అని, మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది.
2 నాయక్:
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషించిన సినిమా నాయక్. వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ వల్లే హిట్ అయ్యింది.
3 ఐ :
ఇది తమిళ్ డబ్ సినిమా. కానీ డైరెక్టర్ శంకర్ సినిమా కావడంతో దీనిపై తెలుగు మూవీ లవర్స్ కూడా చాలానే హోప్స్ పెట్టుకున్నారు. మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చినా.. సంక్రాంతి సీజన్ కావడంతో బాగానే కలెక్ట్ చేసి హిట్ కొట్టింది.
4 నాన్నకు ప్రేమతో:
Advertisement
ఎన్టీఆర్ 25 వ సినిమాగా వచ్చిన ఈ సినిమా కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ఆ తరువాత పండగ సీజన్ కావడంతో మెల్లిగా హిట్ టాక్ తెచ్చుకుంది.
5 శతమానం భవతి:
పండగ సందర్భంగా విడుదల అయిన శతమానం భవతి సినిమా కూడా మొదటి రోజు మిక్స్ టాక్ వచ్చింది. అయితే.. ఫామిలీ ఆడియన్స్ బాగా ఆదరించడంతో ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యింది.
6 జై సింహ:
బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ నే తెచ్చుకుంది. అయితే సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకుని హిట్ అయింది.
7 సరిలేరు నీకెవ్వరూ:
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సరి లేరు నీకెవ్వరూ సినిమా కూడా మొదటి రోజు మిక్స్డ్ టాక్ నే తెచ్చుకుంది. పండగ సీజన్ వల్లే ఈ సినిమా హిట్ అయింది.
8 మాస్టర్:
ఇళయ దళపతి విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించిన సినిమా మాస్టర్. ఇది కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తరువాత హిట్ అయ్యింది.
9 రెడ్:
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా రెడ్. సంక్రాంతి రోజు విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు నెగటివ్ టాక్ నే తెచ్చుకుంది. ఆ తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది.
10 వీర సింహారెడ్డి:
గత సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా కూడా మొదటి రోజు మిక్స్డ్ టాక్ నే తెచ్చుకుంది. ఆ తరువాత ఈ సినిమా హిట్ అయ్యింది. బాలకృష్ణ ఫామ్ లో ఉండడం కూడా ఒకరకంగా ఈ సినిమాకు కలిసొచ్చిందనే చెప్పొచ్చు.