Advertisement
పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతిఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలు, పరమార్ధాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని ఒక ఘట్టం గురించి తెలుసుకుందాం.
Advertisement
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో మామగారు అల్లుడు కాళ్లు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొనే ఆచారం ఒకటి ఉంది. ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
పెళ్లి పనులు మొదలు పెట్టడానికి ముందు ఎటువంటి విజ్ఞాలు రాకుండా వినాయకునికి బియ్యం మూట కట్టి ఆ తర్వాత పనులను మొదలు పెడతారు. అలాగే పెళ్లిలో ఆడపడుచుకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి దూరం కాలేదన్న భావన కలిగించడానికి ఈ ఆచారాలు పెట్టారు. ఇక పెళ్లిలో అల్లుడి కాళ్లు కడిగే సమయంలో మామగారు ఏమని అనుకుంటారో తెలుసుకుందాం.
Advertisement
ఓ పెండ్లి కుమారుడా పంచభూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా కూతురిని ధర్మ, అర్ధ, కామ, మోక్షకై నీకు అర్పిస్తున్నాను. దానం ఇస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను. ఓ పెండ్లి కుమారుడా నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయనుడివే నా బిడ్డ లక్ష్మీదేవి. అంతటా నీకు కాళ్లు కడుగుతున్నానని చెప్పి వరుడి కాళ్లు కడుగుతాడు వధువు తండ్రి. వారిని లక్ష్మీనారాయణలుగా భావించి పెళ్లికి వచ్చిన వారందరూ వారి మీద అక్షింతలు వేసి నమస్కారం చేస్తారు.
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?