Advertisement
ఈరోజు అనగా జనవరి 22వ తేదీ సోమవారం చరిత్ర లో నిలిచిపోయే రోజు. రామాలయంలో అభిజీత్ ముహూర్తంలో బాల రామయ్య విగ్రహం ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రామ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశమంతా కూడా ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రామ్ లల్లా ని ప్రతిష్టించనున్నారు సాయంత్రం శ్రీరామ జ్యోతి వెలిగించనున్నారు ఈ విధంగా శ్రీరాముడుని ఈరోజు ఆరాధిస్తే ఎంతో మంచిదట ఉదయం నుండి మృగశిర నక్షత్రం ఉందని బ్రహ్మయోగం ఏర్పడనుంది. ఉదయం 7:15 నుండి సర్వార్ధ సిద్ధియోగం అమృత సిద్ది యోగం ఏర్పడిందట. మూడు యోగాలు ఏర్పడిన శుభ సందర్భంలో రాముడిని పూజించడం మంచిది. ఈరోజు శ్రీరాముడు చిత్రపటాన్ని ప్రతిష్టించి పంచామృతంతో స్నానం చేయించాలి.
Advertisement
Advertisement
తర్వాత రాముడికి నీటితో అభిషేకం చేయాలి శుభ్రంగా పొడి బట్టతో విగ్రహాలను తుడిచి బట్టలు ధరింప చేయాలి. చందనంతో తిలకాన్ని దిద్దాలి. తర్వాత పూజగదిని, పీఠాన్ని పూలతో అలంకరించాలి అక్షేత పుష్పాలు పండ్లు ధూపం దీపం నైవేద్యం తులసి దళాలు మొదలైన వాటిని సమర్పించాలి. నైవేద్యంగా పండ్లు చలిమిడి వడపప్పు పానకం తో పాటుగా స్వీట్లు కూడా పెట్టొచ్చు శ్రీరామ్ చాలీసా పటిస్తే మంచిది. ” ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ | వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ || వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||” శ్లోకాన్ని చదువుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!