Advertisement
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరువాత కెరీర్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసమో.. లేదా కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో కంటిన్యూ చేయడం కోసమో.. చాలా మంది నటులు పెళ్లి చేసుకోరు. పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. అయితే స్టార్ లు గా ఎదిగిన తరువాత ఎదో ఒక టైం లో వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టేస్తారు. అయితే.. కొందరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ మాత్రం నలభై సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తకుండా ఒంటరి లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
వీటిని కూడా చదవండి: ఈ ఫొటోలోని ప్రముఖ జ్యోతిష్యుడు ఎవరో గుర్తు పట్టారా ? అప్పట్లోనే ఇంత ఫేమస్ ?
సల్మాన్ ఖాన్:
ఈయన్ని బ్యాచిలర్ సంఘానికి అధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు. అరవై ఏళ్ళు వస్తున్నా ఈయన ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తలేదు. ఇకపై ఈయన పెళ్లి చేసుకుంటారు అని కూడా చెప్పలేం.
ప్రభాస్:
పాన్ ఇండియా రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి సినిమా కోసమే ఎక్కువ టైం కేటాయించేసారు. ఆ తరువాత ఊపిరి సలపకుండా మూవీ ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. పెళ్లి టాపిక్ ఎప్పుడు ఎత్తినా డైవర్ట్ చేసేస్తూ ఉంటారు. ప్రభాస్ పెళ్లి చూడాలి అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు.
విశాల్:
తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్ కూడా మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఓ లవ్ ఫెయిల్ సిట్యుయేషన్ ను, రెండు సార్లు ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి ఆగిపోయిన సిట్యుయేషన్ ను ఫేస్ చేసారు. ప్రస్తుతం 46 సంవత్సరాలు వచ్చిన బ్యాచిలర్ గానే ఉండిపోయారు.
తరుణ్:
Advertisement
లవర్ బాయ్ గా వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చిన తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఫామిలీ బిజినెస్ లు చేసుకుంటూ బిజీ గా ఉన్న తరుణ్ నలభై ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.
అనుష్క:
నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి ఊసెత్తని హీరోయిన్స్ లో అనుష్క ఉంది. ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు.. అని చాలానే రూమర్స్ వచ్చినా వీరిద్దరూ పెళ్లి మాటే ఎత్తడం లేదు.
త్రిష:
హీరోయిన్ గా ఈమె రీ ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. ఓ బిజినెస్ మాన్ తో డేటింగ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష.. ఉన్నట్లుండి ఆ పెళ్లి కాన్సల్ అయ్యిందని తెలిపారు. ఆ తరువాత పెళ్లి ఊసే ఎత్తలేదు.
నగ్మా:
సీనియర్ హీరోయిన్ నగ్మా కూడా నార్త్, సౌత్ లలో టాప్ హీరోల సరసన నటించి మెప్పించారు. యాభై ఏళ్ళు వచ్చినా ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. ఇకపై చేసుకుంటారు అన్న నమ్మకం లేదు.
టబు:
90స్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన టబు కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం క్యారక్టర్ రోల్స్ ను చేస్తున్న టబుకు 52 ఏళ్ల వయసు వచ్చింది.
శోభన:
బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల పక్కన నటించిన శోభన వయసు యాభై సంవత్సరాల పైమాటే. అయినప్పటికీ ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. భరతనాట్యం శిక్షణ ఇస్తూ కాలం గడిపేస్తున్నారు.
వీటిని కూడా చదవండి: 32 ఏళ్ల అప్పుడే మోడీ శపథం.. అయోధ్య రామాలయానికి నేడు సాకారం..!