Advertisement
అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. చాపర్‌లో వేదిక వద్దకు చేరుకున్నాడు. మధ్యాహ్నం 12:20 గంటలకు వేడుక ప్రారంభమైంది. రాముడి బాల్య రూపానికి ప్రాణప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యావత్ భారతం ఎంతగానో ఎదురు చూస్తున్న బృహత్ కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రాణప్రతిష్ట పూర్తి అయ్యిన తరువాత అయోధ్య రాముడు దర్శనం ఇచ్చాడు. భక్తకోటికి తన దివ్య మంగళ స్వరూపాన్ని చూపాడు. అయోధ్య గర్భ గుడిలోని రాముడి విగ్రహాలను ట్రస్ట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాల రాముని దివ్య స్వరూపాన్ని చూసి హిందువులందరికి ఒళ్ళు గగుర్పొడుస్తోంది.
Advertisement
ఆ అయోధ్య రాముడిని వజ్రాలు, బంగారం ఆభరణాలతో అలంకరించారు. మెడలో ఎర్రని డైమండ్ నెక్ల్స్ వేసి అలంకరించారు. ఏడూ వారాల నగలతో ఆ బాల రాముడిని దివ్య మంగళ స్వరూపుడిగా అలంకరించారు. ఆయనను చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. ఓ చేతిలో విల్లు మరో చేతిలో బాణం ధరించిన బాల రాముడు చిరు దరహాసంతో మెరిసిపోతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.
Advertisement