Advertisement
సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలెబ్రిటీల ఫోటోలు తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎప్పటిప్పటి జ్ఞాపకాలో.. సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగు లోకి వస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్ లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ పూజారి అలనాటి తారలు రమ్యకృష్ణ, నగ్మా ల మధ్యలో నుంచుని తీయించుకున్న ఫోటో ఇది. ఇంతకీ ఆయనను ఎవరో గుర్తుపట్టారా? ఈ ఫోటో జ్యోతిష్యుడు వేణుస్వామి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పంచుకున్నారు.
Advertisement
ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. ఇది ఆయన కెరీర్ ప్రారంభం లోని ఫోటో. కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా షూటింగ్ సమయంలోనిది ఈ ఫోటో. దాదాపు ముప్పయేళ్ల నాటి ఫోటో ఇది. వేణుస్వామి జాతకాలు చెప్పడానికంటే ముందు సినిమాల్లో నటించేవారని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో సినిమాలకు ముహుర్తాలు పెట్టేవారని, ప్రొడక్షన్ లో కూడా పని చేసేవాడినని వేణుస్వామి చెప్పుకుంటూ ఉంటారు. ఆయన నిజంగా సినిమాల్లో పని చేసారో లేదో తెలియకపోయినా.. ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే మాత్రం.. ఆయనకు చాల మంది సినిమా వారితో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Advertisement
View this post on Instagram
1993 లో ముగ్గురు మొనగాళ్లు సినిమా సమయంలో తీసిన ఫోటోనే ఇది. ఇందులో వేణు స్వామి చాల చిన్న వయసులో ఉన్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు శ్యాం 1989 నుండి సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ జీవితంలో కానీ ఉన్న ఫోటోలను ఓ వీడియో రూపంలో రూపొందించారట. ఈ వీడియో ను వేణుస్వామి తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా.. వేణుస్వామి కి ఇంతమందితో పరిచయాలు ఉన్నాయా అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Read More:
అయోధ్య రామ మందిరం కల సాకారం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం ఇంత ఉందా?