Advertisement
మీరెప్పుడైనా గమనించారా? పెళ్లి అయ్యిన తరువాత చాలా మంది అమ్మాయిలు బరువు పెరుగుతుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే నిపుణులు అందుకు చాలానే కారణాలు ఉంటాయని చెబుతున్నారు. శారీరకంగా వచ్చే మార్పుల వలన, హార్మోన్లలో వచ్చే మార్పుల వలన, పెళ్లి అయ్యాక లైఫ్ స్టయిల్ మారడం వలన కూడా అమ్మాయిల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్లనే అమ్మాయిలు ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటారు. పెళ్ళికి ముందు అమ్మాయిలు తమ శరీరం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు.
Advertisement
బరువు పెరగకుండా ఉండడం కోసం ఎక్కువ కేర్ తీసుకుంటారు. కానీ, పెళ్లి అయ్యిన తరువాత ఆ కోరిక కొంత వరకు తగ్గుతుంది. కొంత నిర్లక్ష్యం పెరుగుతుంది. దానికి తోడు అదనపు బాధ్యతల వలన శరీరంపై శ్రద్ధ చూపించడానికి అంత అనువైన సమయం కూడా ఉండదు చాలా మందికి. ఫలితంగా వారి శరీరం బరువు పెరిగి పోతూ ఉంటుంది.
Advertisement
పెళ్ళైన కొత్తల్లో అమ్మాయిలు ఎక్కువగా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి పలువురు ఇంటికి వెళ్లడం, ఫంక్షన్స్ కి వెళ్లడం చేస్తూ ఉంటారు. ఫలితంగా ఎక్కువగా ఆహార పదార్ధాలు తీసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా.. తమ లైఫ్ పార్టనర్ తో పాటు సరదాగా గడపడానికి బయటకి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ ను లాగించేస్తూ ఉంటారు. ఫలితంగా ఎక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం, శరీరం పై శ్రద్ధ తగ్గడం వంటి కారణాలు, పెళ్లి అయ్యాక చాలా మందిలో సహజంగా జరిగే హార్మోన్ల మార్పుల వలన కూడా అమ్మాయిలు లావు అవుతూ ఉంటారు.
Read More:
ఈ ఫొటోలోని ప్రముఖ జ్యోతిష్యుడు ఎవరో గుర్తు పట్టారా ? అప్పట్లోనే ఇంత ఫేమస్ ?
అయోధ్య రామ మందిరం కల సాకారం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం ఇంత ఉందా?