Advertisement
సాధారణంగా అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా టాయిలెట్ ను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొత్త బట్టలు కొనుగోలు చేసిన సమయంలో కూడా ట్రైల్ రూము ఉపయోగిస్తారు. అయితే కొందరు దుర్మార్గులు పరిస్థితులను అనుకూలంగా తీసుకొని స్పై కెమెరాలు సీక్రెట్ కెమెరాల సహాయంతో పబ్లిక్ టాయిలెట్స్ లో, లేదంటే ట్రయల్ రూమ్స్ లో వీడియోలు చిత్రీకరిస్తూ ఇబ్బంది పెట్టే ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వీడియోలను షూట్ చేసి కొంత మంది బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ చివరికి దొరికిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
Advertisement
Advertisement
ఇలాంటి సంఘటనలు నుండి మనం ఈజీ గా గుర్తించి వాటి నుంచి బయట పడే కొన్ని విషయాలు మీరు చూడండి.. మన హోటల్ లో కానీ షాపింగ్ మాల్స్ లో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాష్ రూమ్ లను వినియోగించుకునే ముందు అక్కడ ఉన్న పరికరాలను చాలా నిశితంగా పరిశీలించాలి. కెమెరాలు పెట్టడానికి ఎన్నో అనువైన ప్రదేశాలు ఉంటాయి. ఏవైనా చిన్న రంధ్రాలు ఉంటే అందులో సీక్రెట్ కెమెరాలు పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ట్రయల్ రూంలో కి వెళ్ళినప్పుడు అందులో ఉన్న అద్దం సింగిల్ సైడ్ లేదా డబుల్ సైడ్ అద్దమో చెక్ చేసుకోవాలి. వేలి మధ్య గ్యాప్ ఉంటే అది సింగిల్ సైడ్ అద్దమని, వేలి మధ్య గ్యాప్ లేకుంటే అది డబుల్ సైడ్ అద్దమని మనం గుర్తుంచుకోవాలి.
స్పై కెమెరాలు ఉన్న గది నుండి సిగ్నల్ సమస్యలు వస్తే కాల్ రాబోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈజీగా గుర్తు పట్టాలంటే గది లో ఉన్నటువంటి లైట్లు అన్నింటిని ఆప్ మొబైల్ కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి వాటిని గుర్తించవచ్చు. అలాగే మీ మొబైల్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ను కూడా ఇన్స్టాల్ చేయడం ద్వారా ఈ కెమెరాలను గుర్తించవచ్చు. ఒకవేళ హెడేన్ కెమెరాలు ఉన్నాయని మనకు అనిపిస్తే 911 అనే నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ALSO READ: