Advertisement
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా పని చేస్తూ ఉంటారు. ఓ వైపు నేతాజీని పట్టుకోవాలి అని బ్రిటిష్ గవర్నమెంట్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బోస్ ఇండియా వస్తున్నదని తెలుస్తుంది. ఓ సీక్రెట్ కోడ్ ద్వారా బోస్ ఆ విషయాన్ని తెలియచేసాడు. దాని ద్వారా బోస్ ఎక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు అనే విషయం బ్రిటిషర్లకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్నట్లు నటిస్తాడు.
Advertisement
కానీ అతను పని చేసేది మాత్రం నేతాజీ కోసమే. క్లైమాక్స్ వరకు ఈ విషయం తెలియదు. సినిమాలో డెవిల్ పేరే త్రివర్ణ. ఆమె నేతాజీ రైట్ హ్యాండ్. ఈ త్రివర్ణ క్యారక్టర్ లోనే కళ్యాణ్ రామ్ నటించారు. అయితే.. ఈ పాత్ర రియల్ లైఫ్ లో నేతాజీకి రైట్ హ్యాండ్ గా ఉన్న సరస్వతి రాజమణి అనే మహిళను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.
Advertisement
ఐఎన్ఏలో మిలిటరీ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేసిన సరస్వతి రాజమణి భారత దేశపు మొట్టమొదటి మహిళా గూఢచారి కూడా. ఓ సారి నేతాజీ బర్మా వెళ్లిన సమయంలో ఈమె ఆయన్ని కలిసి ఐఎన్ఏలో చేరారు. ఆమె అసలు పేరు రాజమణి కాగా.. ఆమె తెలివితేటలను గుర్తించి నేతాజీ ఆమెకు సరస్వతి అని పేరుని పెట్టారు. ఆమెతో పాటు ఆమె స్నేహితులను కూడా నేతాజీ గూఢచారులుగా నియమించారు. బ్రిటీషర్ల సీక్రెట్స్ తెలుసుకోవడం కోసమే ఆమె కోల్కతాలోని బ్రిటిష్ మిలిటరీ స్థావరంలో ఓ కార్మికుడి వేషం వేసుకుని పని చేసారు.1943 లో నేతాజీ ఇండియా వస్తున్నారని తెలుసుకున్న బ్రిటిష్ మిలిటరీ ఆయన హత్యకి ఏర్పాట్లు చేసుకుంది. ఎంతో తెలివిగా, చాకచక్యంగా సరస్వతి రాజమణి నేతాజీని ఇండియాకు రాకుండా ఆపారు. బ్రిటిష్ వారి దగ్గర పని చేసిన ఈ రియల్ డెవిల్ చుట్టూనే కళ్యాణ్ రామ్ “డెవిల్” సినిమా తిరుగుతుంది.
Read More: