Advertisement
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇవ్వబోయే పద్మ పురస్కారాల గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి కూడా పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈ సారి మెగాస్టార్ తో సహా మరో నలుగురికి పద్మ విభూషణ్ అవార్డు లభించింది. మరో పదిహేను మంది తెలుగు వారికి కూడా పద్మ పురస్కారాలు లభించాయి. దీనితో తెలుగు వారంతా ఫుల్ జోష్ లో నిండిపోయారు. అయితే.. ఇప్పుడు చాలా మంది ఇలాంటి పద్మ పురస్కారాలు వస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్న విషయమై చర్చలు జరుపుతున్నారు.
Advertisement
అందరు ఈ విషయం గురించి గూగుల్ చేస్తున్నారు. అసలు ఈ పురస్కారాలు రావడం వలన కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అవార్డు ఓ వ్యక్తికీ కేంద్రం ఇచ్చే గౌరవం మాత్రమే. ఈ అవార్డు వలన ఎటువంటి నగదు బహుమతులు లభించవు. అలాగే రైలు ప్రయాణాల్లోను, ఇతర సందర్భాలలోనూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము అందదు. అలాగే వారికి ఏమీ స్పెషల్ పవర్స్ ఉండవు. ఒక వ్యక్తి యొక్క ప్రతిభని గుర్తించి కేవలం గౌరవంగా మాత్రమే ఈ అవార్డుని ఇస్తారు.
Advertisement
ఈ అవార్డు అందుకున్న వ్యక్తులు డైరెక్ట్ గా రాష్ట్రపతిని కలిసి అవార్డు అందుకోవచ్చు. పుస్తకాలూ, లెటర్హెడ్లు, ఆహ్వాన కార్డులు, పోస్టర్లు వంటి చోట్ల అవార్డు అందుకున్న వారు తమ అవార్డుని పేరుకి ముందు పెట్టుకోకూడదు. ఇది కేవలం వారి పరిశ్రమలో వారి అసాధారణమైన పని తీరుని గుర్తించి ఇచ్చే బహుమానం మాత్రమే.
Read More:
మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ ప్లాన్ చేయనున్న టాలీవుడ్?
బాలకృష్ణ హీరోగా చేయడానికి ముందు కెమరామెన్ గా పని చేసారా? ఏ సినిమా కోసం అంటే?