Advertisement
నటి నిహారిక కొణిదెల మరియు టెక్కీ చైతన్య JV డిసెంబర్ 9, 2020న ఉదయపూర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత వారిద్దరూ విడిపోతున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. ఆ తరువాత జూలై 2023లో ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత నుంచి వీరిద్దరూ విడాకుల విషయమై మౌనంగానే ఉన్నారు. చాలా రోజుల తరువాత నిహారిక తన స్నేహితుడు నిఖిల్ విజయేంద్ర సింహాతో పాడ్కాస్ట్లో మొదటిసారిగా తన విడాకుల గురించి ఓపెన్ గా మాట్లాడారు. దీనిపై ఆమె మాజీ భర్త చైతన్య కూడా స్పందించారు.
Advertisement
విడాకుల గురించి మొదటిసారి మాట్లాడిన నిహారిక విడాకుల వల్ల చాలా బాధపడ్డానని.. మనుషుల్ని నమ్మకూడదు అనే లైఫ్ లెసన్ ని నేర్చుకున్నానని తెలిపారు. విడాకుల తరువాత ఎక్కువగా నన్నే ట్రోల్ చేసారని.. ఆ ట్రోల్స్ ని చూసి చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కామెంట్స్ పై చైతన్య జొన్నలగడ్డ స్ట్రాంగ్ గానే స్పందించారు. ఇంటర్వ్యూ ప్రోమో కిందే ఆయన స్పందించారు. నిహారికపై వచ్చిన ట్రోలింగ్, నెగటివిటీ గురించి లేట్ గా అయినా మాట్లాడినందుకు అభినందనలు అని.. ఇలాంటి వ్యక్తిగత కామెంట్స్ ను ఎదుర్కోవడం చాలా కష్టమని తెలుసు అని అన్నారు.
Advertisement
కాని, పరోక్షంగా అందులోని బాధితుల్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలా జరగడం ఇది రెండోసారని, బాధ రెండువైపులా ఉంటుంది అని.. విడాకుల గురించి ఎక్కువ మాట్లాడకూడదు.. ముఖ్యంగా ఒకవైపే మాట్లాడకూడదని అన్నారు. ఎంత బాధ అనుభవించాం అన్న దానికంటే దాని నుంచి ఎలా బయటపడ్డాం అనేదాని గురించి చెబితే జనాలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఏమి తెలియకుండా ప్రజలు జడ్జి చేయడం ఒక తప్పు అయితే.. ఇలాంటి ప్లాట్ ఫామ్స్ పై ప్రజలకు ఒక వైపే జరిగింది కూడా తప్పేనని అన్నారు.
Read More:
త్రివిక్రమ్ ని కాకుండా బోయపాటిని ఎంచుకున్న అల్లు అర్జున్.. ‘గుంటూరు కారం’ ఎఫెక్ట్ ఏ నా?
పుష్ప 2 రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన యూనిట్.. ముందుంది అసలు ఛాలెంజ్!