Advertisement
ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్ కు ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు 2006 లోనే పద్మ భూషణ్ అవార్డు లభించింది. తాజాగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. 1955 ఆగష్టు 22 న నరసాపురంలో చిరంజీవి జన్మించారు. ఆయన తాత జె.ఆర్.కె నాయుడు శివుడి భక్తుడవడంతో శివ శంకర్ ప్రసాద్ అని నామకరణం చేసారు.
Advertisement
చిన్నప్పటి నుంచే చాలా హుషారుగా యాక్టివ్ గా ఉండే చిరంజీవి డాన్స్ పై ఆసక్తి కనబరిచేవాడు. అలాగే ఓసారి హై స్కూల్ లో ఉన్న సమయంలో కల్చరల్ యాక్టివిటీస్ లో భాగంగా ఓ నాటకంలో పరంధామయ్య గారి పాత్రని పోషించాడు. మొదటగా ఆయన నటనకు అక్కడే బీజం పడింది. తల్లి తండ్రి కూడా నటనపై ఆయనకీ ఉన్న ఇంటరెస్ట్ ని ఎంకరేజ్ చేసారు. తల్లి కోరికతో ఇంటర్ లో బైపీసీ తీసుకున్న చిరంజీవి వై ఎం ఎం లో డిగ్రీ పూర్తి చేసారు. కాలేజీ రోజుల్లోనే రాజీనామా లో అనే నాటకంలో చైర్మన్ పాత్రని పోషించారు. నాటకాలపై ఉన్న ఆసక్తితోనే సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. సినిమాల్లోకి రావడం కరెక్టేనా అని చాలానే ఆలోచించుకున్నారు.
సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుని మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఐదు నెలల్లో ట్రైనింగ్ అయిపోతుంది అనుకున్న టైం లో “పునాది రాళ్ళూ” సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ టైం లోనే పేరు కూడా మార్చుకోవాలని అనుకున్నారు. “చిరంజీవి..” అంటూ ఆయనకీ ఓ కల వచ్చింది. ఆ కల గురించే అంజనాదేవికి చెప్పగా.. అది హనుమంతుడి పేరు అని చెప్పారట. అలా.. ఆ పేరు తోనే వరప్రసాద్ చిరంజీవిగా మారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పునాది రాళ్ళూ తో పాటు ప్రాణం ఖరీదు సినిమాలో కూడా నటించారు. పునాది రాళ్ళూ సినిమాకు బ్రేక్ పడడంతో ప్రాణం ఖరీదు సినిమా ముందు రిలీజ్ అయ్యింది.
Advertisement
ట్రైనింగ్ లో ఉన్న సమయంలోనే ఓ సారి పూర్ణ పిక్చర్స్ సంస్థ వారి ప్రివ్యూ లను చిరు, సుధాకర్ లు చూసి రివ్యూ లు ఇస్తూ ఉండేవారు. ఆ టైం లో ఆ సినిమాలో హీరో గా నటించిన వారి మేకప్ మాన్, డ్రైవర్లు వారిని లేపి వారి ప్లేస్ లో కూర్చున్నారు. దీనితో చేసేది లేక వారు నుంచుని సినిమా చూసి రివ్యూ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ ఇంటికి వచ్చాక ఆ సంస్థ అధినేత భార్యకు చెబుతూ.. “ఆంటీ మేము మీ అతిధులుగా వెళ్ళాం.. కానీ వారు మమ్మల్ని డోర్ దగ్గర నుంచోబెట్టారు. తిరిగి వస్తే మీకు చెడ్డ పేరు వస్తుందనే భరించామని.. ఈ ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరోని అవ్వకపోతే అడగమని.. చిరంజీవి ఛాలెంజ్ చేసారు. అన్నట్లు గానే ఆ ఛాలెంజ్ ను ప్రూవ్ చేసి చూపించారు.
అందరి వాడు, మనవూరి పాండవులు ఇలా చాలా సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఖైదీ సినిమా కూడా చిరంజీవికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. 1980, 1983 లలో `దాదాపు 14 సినిమాలు చేసారు చిరంజీవి. అందుకే బ్రహ్మానందం ఆయన్ని అలుపెరుగని సూర్యుడు అంటూ అభివర్ణించారు. ఇక చిరంజీవి తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈరోజుకి కూడా ఆయన తన ఫాన్స్ ని తన సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు.అంతే కాదు.. ఇండస్ట్రీలో ఎందరికో పెద్ద దిక్కుగా అండగా ఉన్నారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డుని ఇచ్చింది.
Read More:
సాయి పల్లవి, రామ్ లక్ష్మణ్ కాకుండా.. టాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న టాలీవుడ్ ట్విన్స్ వీరే!
మంచుకొండల్లో అతనికి ఒకే చెప్పేసిన అమీ జాక్సన్.. ఇంతకీ అతనెవరంటే?