Advertisement
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్యాక్-టు-బ్యాక్ భారీ హిట్లను అందించిన కొరటాల శివ అందరికి సుపరిచితుడే. ప్రతి డైరెక్టర్ కి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వాలన్న డ్రీం ఉంటుంది. టైర్-1 హీరోలతో ఈ నాలుగు హిట్లు కొరటాల శివకు టాలీవుడ్ లో బాగా డిమాండ్ ను తీసుకొచ్చాయి. అయితే ఆచార్యతో కొరటాల బ్యాడ్ టైమ్ మొదలైంది. ముందుగా, సినిమా అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం సెట్స్‌పైనే ఉంది. తీరా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ గా మిగిలింది.
Advertisement
షూటింగ్లో జరిగిన అనూహ్య సంఘటనల కారణంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్న కొరటాలకు ఆర్ధిక పరమయిన ఇక్కట్లతో పాటు.. కెరీర్ పై కూడా దెబ్బ పడింది. ఆచార్య సినిమా రిలీజ్ తరువాత చిరంజీవి చాలా సందర్భాలలో పరాజయానికి కొరటాల శివపై నేరుగా నిందలు వేశారు. దీని తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా క్యాన్సిల్ అయింది. చివరగా దేవర సినిమా విషయమై కొరటాల కోసం ఎన్టీఆర్ వచ్చాడు.. అంతా సెట్ అయ్యింది.. అని అనుకుంటున్న టైం లో మరో ఇబ్బంది వచ్చి పడింది.
Advertisement
ఇప్పుడు శ్రీమంతుడు స్టోరీ కాపీ కేసుతో కొరటాలకు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కోర్టు, కేసు వేసిన రచయిత శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు నుంచి బయటపడేందుకు రచయితతో సమస్యను పరిష్కరించుకోవడమే కొరటాల శివ ముందున్న ఏకైక మార్గం. అయితే రచయిత శరత్ చంద్ర బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో కొరటాల శివ డైలమాలో ఉన్నారు.
Read More:
సుకుమార్ పై అల్లు అర్జున్ ఆగ్రహం.. అసలు కారణం అదేనా?