Advertisement
ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం జై హనుమాన్‌లో చిరంజీవి మరియు మహేష్ బాబు లార్డ్ హనుమాన్ మరియు శ్రీరామునిగా కనిపించనున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. జై హనుమాన్‌లో హనుమంతుడిగా, శ్రీరాముడిగా చిరంజీవి, మహేష్ బాబులను చూసే అవకాశం ఉందని తెలియడంతో నెటిజన్స్ ఫుల్ గా థ్రిల్ అవుతున్నారు.
Advertisement
““శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు నటించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. చాలా మంది నెటిజన్స్ లాగానే మేము కూడా మా ఆఫీస్ లో మహేష్ బాబు శ్రీరాముడిలా ఉంటె ఎలా ఉంటుందో కొన్ని ఎడిట్స్ చేసి చూసాము. అయితే అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం’’ అని దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తేజ సజ్జ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎండింగ్ లోనే సీక్వెల్ గురించి అనౌన్స్ చేసారు.
Advertisement
సీక్వెల్లో హనుమంతుడి పాత్రను ఎవరు పోషించబోతున్నారనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రశాంత్ వర్మ మరియు యూనిట్ మొదటి భాగంలో హనుమంతుడి ముఖం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఒక వర్గం ప్రేక్షకులు హనుమంతుని కళ్లను చిరంజీవి కళ్లలాగా భావించారు. ఆ పాత్రను చిరంజీవి చేస్తారనే టాక్ వినిపిస్తోంది. సీక్వెల్లో రాముడి పాత్ర కూడా కనిపించనుంది. దీంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ రెండు పాత్రలలో ఎవరు నటించబోతున్నారు? అన్న విషయమై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే చర్చ జరిగింది. అయితే డైరెక్టర్ చెప్పినట్లు హనుమాన్ గా చిరంజీవి, శ్రీరాముడిగా మహేష్ బాబుని ఇమాజిన్ చేసుకోవడానికి హనుమాన్ సినిమా ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.
Read More:
సుకుమార్ పై అల్లు అర్జున్ ఆగ్రహం.. అసలు కారణం అదేనా?