Advertisement
సోషల్ మీడియా రెండంచుల కత్తి. ఒక వైపు, ఇది తక్షణ కీర్తిని తీసుకురాగలదు మరియు అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మరో వైపు ఇది చాలా ప్రమాదకరం కూడా. ప్రతిష్టలు, సంబంధాలు మరియు మానసిక శ్రేయస్సుకు గణనీయమైన నష్టాన్ని కలిగించవచ్చు. సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పుడు ఏ విషయం అయిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందుకు ఉదాహరణ కుమారి ఆంటీ నే. సోషల్ మీడియా ద్వారా ఆమె ఫుడ్ స్టాల్ కి చాలా మంచి పేరొచ్చింది. కానీ ప్రస్తుతం ఆ పాపులారిటీ నే నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది.
Advertisement
Also Read: కాల సర్ప దోషం అంటే ఏమిటి? ఇది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది?
ఇంతకీ ఇంతలా వైరల్ అవుతున్న కుమారి ఆంటీ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడివాడ నుంచి వచ్చిన కుమారి ఆంటీ హైదరాబాద్ లో రోడ్ సైడ్ నే ఫుడ్ అమ్ముతూ బిజినెస్ చేసుకుంటున్నారు. ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి. సోషల్ మీడియాలో కుమారి అంటీగా ఫేమస్ అయ్యారు. మీ బిల్ వెయ్యి రూపాయలు అయ్యింది అంటూ ఓ కస్టమర్ ని ఉద్దేశించి ఆమె అనడం ఓ వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది.
Also Read: ప్రతి రోజూ వాల్ నట్స్ తింటే ఏమి జరుగుతుందో తెలుసా? ఈ విషయాలు తప్పకుండ తెలుసుకోండి!
Advertisement
ఆమె ట్రెండింగ్ లో ఉండడంతో ఓ సారి ఊరి పేరు భైరవ కోన మూవీ యూనిట్ ఓసారి ఆమెను కలిసింది. హీరో సందీప్ కిషన్ తో పాటు హీరోయిన్ కూడా వెళ్లడంతో మీడియా దృష్టి కుమారి ఆంటీ పై ఫోకస్ అయ్యింది. దీనితో చాలా మంది ఆమె హోటల్ కి రావడం స్టార్ట్ చేసారు. నిజంగానే అంత సంపాదిస్తారా? ఆమె ఫుడ్ అంత బాగుంటుందా? ఓ సారి ట్రై చెయ్యాలి..ఇలా అనుకుంటూ చాలా మందే అక్కడకి క్యూ కట్టారు.
దీనితో అక్కడి రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వసాగాయి. ఈ క్రమంలో ఆమె ఫుడ్ ట్రక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఆమె బిజినెస్ కు గండి పడింది. ఓ సారి ఇంటర్వ్యూ లో ఆమెకు జగన్ ఇల్లు ఇచ్చారు అని చెప్పడంతో.. ఆమె విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి టీడీపీ, జనసేనలే కారణం అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పొలిటికల్ డిస్కషన్ అంతా సీఎం రేవంత్ రెడ్డిని చేరింది.
ఈ క్రమంలో ఆయన ఎంట్రీ ఇచ్చి ఆమె బిజినెస్ ఆమెను చేసుకోనివ్వాలని.. ఇటువంటి చిరు వ్యాపారాలకు మనమే అండగా ఉండాలి అని చెప్పారు. దీనితో ఆమె మరింత ఫేమస్ అయ్యారు. గుడివాడకు చెందిన ఆమె పదమూడేళ్ల నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు. గతంలో ఆమె సింగర్ హేమ చంద్ర ఇంట్లో వంట మనిషిగా కూడా పని చేశారట. లాక్ డౌన్ టైం లో గుడివాడ వెళ్లిపోయిన ఆమె ఫామిలీ కూరగాయలు పండించి అమ్మే వారు. ఆ తరువాత తిరిగి హైదరాబాద్ కు వచ్చి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసారు. కానీ పాపులారిటీ కూడా ఆమెకు కీడు చేసింది. ఫుడ్ ట్రక్ ను తీసేసుకోవడం వలన దాదాపు యాభై వేల రూపాయల వరకు బిజినెస్ ఆగిపోయిందని ఆమె బాధపడ్డారు. ఓ సాధారణ వంట మనిషి నుంచి సీఎం గుర్తించే స్థాయికి ఎదిగిన కుమారి ఆంటీ ఇప్పుడు అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు.
Also Read: మీడియాకి గట్టిగా ఇచ్చి పడేసిన విరాట్ బ్రదర్.. ఆ వార్తలు అబద్ధం అంటూ?