Advertisement
బిగ్ బాస్ కోసం పోటీ చేయడం దగ్గర నుంచి విన్నర్ అవడం దాకా పల్లవి ప్రశాంత్ జర్నీ సోషల్ మీడియా యూజర్లందరికి సుపరిచితమే. రైతు బిడ్డగా నెటిజన్స్ కి పరిచయం అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ఓ ఆట ఆడి గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ముగిసిన వెంటనే ప్రశాంత్ వివాదాల్లో చిక్కుకున్నాడు కూడా. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది కలిగించడం, అతని అభిమానులు ఇతర కంటెస్టెంట్ల వాహనాలపై దాడి చేయడం.. వంటి కారణాలతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. దీనితో అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పల్లవి ప్రశాంత్ గురించి చాలానే చర్చ జరిగింది.
Advertisement
వీటిని కూడా చదవండి: వైరల్ అయిన కుమారి ఆంటీ ఒకప్పుడు హేమ చంద్ర ఇంట్లో వంట మనిషి అని తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఇది ఇలా ఉంటె వరంగల్ కు చెందిన బర్రెలక్క శిరీష కూడా బాగానే పాపులారిటీ గైన్ చేసారు. నిరుద్యోగానికి సంబంధించి ఆమె ఒక రీల్ చేయడంతో అది చాలా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీ రావడంతో ఆమె ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఐదు వేల ఓట్లను సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేయడంతో రెండు రాష్ట్రాల నుంచి ఆమెకు గట్టిగానే సపోర్ట్ లభించింది.
Advertisement
వీటిని కూడా చదవండి: కాల సర్ప దోషం అంటే ఏమిటి? ఇది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది?
బర్రెలక్క, పల్లవి ప్రశాంత్ ఇద్దరికీ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే.. సోషల్ మీడియాలో ఉన్నట్లుండి వీరిద్దరి గురించి ఓ వార్తా వైరల్ అవుతోంది. ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు కానీ.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ గతంలో ఎప్పుడు కలిసింది లేదు. ఒక్కసారి కూడా ఒక స్టేజి పై వీరిద్దరూ కనిపించలేదు. కానీ, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకు అటు బర్రెలక్క కానీ, ఇటు పల్లవి ప్రశాంత్ కానీ స్పందించలేదు.
Read More: హల్వా సెరిమోనీ అంటే ఏమిటి? బడ్జెట్ మీటింగ్స్ లో దీనికి ఎందుకు ప్రాధాన్యతను ఇస్తారు?