Advertisement
Ambajipeta Marriage Band Review: నటుడు సుహాస్ గతం లో కూడా తన సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా అంతకు మించిన నటన తో అంబాజీపేట మ్యారేజి బ్యాండు వచ్చింది. హీరోగా సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా లో అదరగొట్టేసాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా హిట్ కొడుతుంది అని ఆడియెన్స్ కూడా ఎక్కువ గానే ఎక్స్పెక్ట్ చేసారు. అనుకున్నట్టే సినిమా బాగుంది. మరి ఎలా కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.
Advertisement
ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. హైదరాబాదులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బిగ్ టిక్కెట్ ని విజయ్ దేవరకొండ మొన్న రిలీజ్ చేసారు. సినిమా చూసి సినిమా ని మెచ్చుకున్నారు. బాగుందని సుహాస్ అలానే చిత్ర యూనిట్ ని విజయ్ ప్రశంసించారు. ఒక స్పెషల్ మూవీ ఇది తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కథ, రివ్యూ చూసేద్దాం.
నటినటులు: సుహాస్, శివాని నగరం, నితిన్ ప్రసన్న. శరణ్య ప్రదీప్
దర్శకత్వం: దుష్యంత్ కటికనేని
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, బన్నీ వాస్, వెంకటేష్ మహా
సంగీతం:శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ:వాజిద్ బేగ్
రిలీజ్ డేట్: 02-02-2023
కథ మరియు వివరణ:
Advertisement
కథ విషయానికి వచ్చేస్తే.. అంబాజీపేట చిన్న ఊరు. అక్కా తమ్ముళ్లు మల్లి ( సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) ఇక్కడ వుంటారు. కోటీశ్వరుడు వెంకట్ ఊరిలో అప్పులు ఇస్తూ ఉంటాడు, అలానే అందరినీ కంట్రోల్ లో పెట్టుకుంటూ ఉంటాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పని చేస్తున్న మల్లి, వెంకట్ చెల్లులు లక్ష్మీ ( శివానీ నాగారం) లవ్ చేసుకుంటారు. వెంకట్, పద్మ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. వెంకట్ కి తన చెల్లులు మల్లితో ప్రేమలో ఉందని తెలిసిపోతుంది. ఈ కారణం తో పద్మని దారుణంగా అవమానిస్తాడు. అక్కడ నుండి ఎన్నో మలుపులు తిరుగుతుంది కథ. ఆ తరవాత ఏం అవుతుంది..? అన్నీ తెలియాలంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ని చూడాల్సింది.
ఇక సినిమా లో ప్లస్ లు మైనస్ లు విషయానికి వచ్చేస్తే.. దర్శకుడు నేరేషన్ మొదలు పెట్టిన తీరు చాల బాగుంది. ఈ మూవీ లో లవ్ ట్రాక్ పెద్ద ప్లస్ సినిమా కి. అలానే ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ బ్యాంగ్ దాకా కథని బాగా తీశారు. ఫస్ట్ ఆఫ్ కంటే ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్ లో వుంది. సుహాస్ నటన, శరణ్య ప్రదీప్ నటన, కథ డైరెక్షన్, మ్యూజిక్ ఈ మూవీ ని ఓ రేంజ్ అనేలా చేశాయి. సడెన్ గా క్లైమాక్స్ కి వెళ్లిపోవడం అలానే రొటీన్ కథ సినిమా కి మైనస్.
ప్లస్ పాయింట్స్:
సుహాస్ నటన
కథ
డైరెక్షన్
శరణ్య ప్రదీప్ నటన
మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
రోటీన్ స్టోరీ
సడెన్ గా క్లైమాక్స్ కి వెళ్లిపోవడం
రేటింగ్: 3.25/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!