Advertisement
వరుస మిక్స్ టాక్ మూవీస్ తో ఉన్న ప్రభాస కు “సలార్” విజయం ఊరటని ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి ప్రభాస్ ఫాన్స్ ని ఫుల్ ఖుష్ చేసేసింది. ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు ఒకెత్తు అయితే.. కాటేరమ్మ ఫైట్ మరొక ఎత్తుగా కనిపిస్తుంది. ఈ సన్నివేశంలో అందరికి గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్ ఒకటి ఉంటుంది. ” ఆ కాటేరమ్మ రాలేదు కానీ.. బదులుగా కొడుకుని పంపింది అమ్మా..” అనే డైలాగ్ ఈ సన్నివేశానికి హైలైట్ గా నిలుస్తుంది. ఆ సన్నివేశం, ఆ ఫైట్స్ అన్నీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి.
Advertisement
అయితే.. చాలా మందికి కాటేరమ్మ దేవత ఎవరు ? అన్న విషయం తెలియదు. ప్రస్తుతం నెట్టింట్లో ఆమె గురించే చర్చ నడుస్తోంది. ఈ దేవత వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. కైలాసంలో పరమేశ్వరుడు నిద్ర పోతున్న సమయంలో పార్వతి దేవి చీకటిలో ఎక్కడికో వెళుతూ ఉండేదట. తిరిగి తెల్లారేసరికి కైలాసానికి వచ్చేసేదట. అది గమనించిన పరమేశ్వరుడు ఓ సారి పార్వతి దేవిని నిలదీశారట. అయితే ఇది తనకి తెలియకుండానే జరిగిపోతోంది అని పార్వతి దేవి చెప్పిందట.
Advertisement
ఓరోజు పరమేశ్వరుడు పార్వతి దేవిని అనుసరిస్తూ వెళ్తాడట. కొంత దూరం వెళ్ళాక అడవి గుండా వెళ్తున్న పార్వతి దేవి ఉన్నట్లుండి కాళికా అవతారంగా మారి అక్కడి శవాలను బయటకి తీసి తినబోతుందట. దీనితో పరమేశ్వరుడు ఉగ్రరూపంలో ఉన్న ఆమెను ఆపడం కోసం ఆమె వెళ్లే మార్గంలో ఓ గోతిని తవ్వుతాడట. అందులో పడిపోయిన పార్వతి దేవి తాను చేసేది తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతుంది. ఆ తరువాత ఉగ్రరూపాన్ని వదిలేసి.. శాంతమూర్తిగా కైలాసానికి వెళ్ళిపోతుంది. ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ. ఆమె కర్ణాటక లో కాటేరమ్మగా, తమిళనాడు కాటెరి అమ్మన్ గా పూజలందుకుంటూ ఉంటారు. ఆమెను కుల దేవతగా, కాపలా దేవతగా కొలుస్తూ ఉంటారు.
Read More:
ప్రశాంత్ వర్మ జీవితం లో ఈమె చాలా స్పెషల్ ! ? దర్శకుడు అవ్వకముందు ఏ ఉద్యోగం చేసేవారంటే ?
వాడు 80 కోట్లు కొట్టేయడం వల్లే రోడ్డున పడ్డాం.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరి జగన్నాథ్ తల్లి!