Advertisement
మాండ్యా జిల్లాలోని మేలుకోటే ప్రాంతంలోని ఒక దేవాలయం సమీపంలో ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 28 ఏళ్ల ఉపాధ్యాయురాలి మృతదేహం కనిపించకుండా పోయిన రెండు రోజుల తరువాత, ఆమె మృతదేహాన్ని మంగళవారం పోలీసులు కనిపెట్టారు. పాండవపుర తాలూకా మాణిక్యహళ్లి గ్రామానికి చెందిన దీపిక వి గౌడకు భర్త, ఏడేళ్ల కుమారుడు ఉన్నట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఎప్పటిలాగే తన ద్విచక్ర వాహనంపై పాఠశాలకు బయలుదేరింది. అనుకున్న సమయానికి ఇంటికి రాకపోవడంతో భర్త మొబైల్ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
Advertisement
Advertisement
ఎంతసేపటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు కంప్లైంట్ చేసారు. మిస్సింగ్ కేసుని నమోదు చేసారు. సెర్చ్ ఆపరేషన్‌లో, ఆలయ మైదానం సమీపంలో దీపికా స్కూటీ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. సోమవారం, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో ఆమె కోసం వెతకడం ప్రారంభించగా.. ఒక ప్రాంతం నుంచి దుర్వాసన రావడం చూసారు. ఓ చోట ఇసుకని తవ్వి చూడగా అక్కడ దీపికా దుస్తులు కనబడడంతో మరింత తవ్వి చూసారు. దీపికా మృతదేహం కనిపించింది. ఈ కేసులో నిందితుడు నితీష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. పధకం ప్రకారమే నితీష్ దీపికాని హత్య చేసారని పోలీసులు తెలిపారు.
నితీష్ దీపికా గొంతు నులిమి ఆమె చున్నీ తోనే గొంతు చుట్టేసి ఆమెకు ఊపిరి ఆడకుండా చేసారు. అక్కా అక్కా.. అంటూ ఆమె వెంట తిరిగే నితీష్ పధకం ప్రకారమే ఆమెను ఆ చోటు కి రప్పించి.. అనుకున్న ప్రకారమే హత్య చేసాడని పోలీసులు చెబుతున్నారు.
Read More:
అమ్మాయిలు తమ పార్టనర్ ని ఎందుకు మోసం చేస్తారు? ఈ కారణాలని చూడండి!