Advertisement
సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీసాక.. అది సరిగా సక్సెస్ అవకా ఫ్లాప్ అయ్యి నష్టం వస్తే ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే కొందరు డైరెక్టర్స్, హీరోలు ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములాని ఫాలో అయిపోతూ ఉంటారు. అంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమానే రీమేక్ చేస్తూ ఉంటారు. కానీ, కొందరు డైరెక్టర్లు మాత్రం తమ సొంత క్రియేటివిటీని నమ్ముకుంటూ ఉంటారు. రీమేక్స్ జోలికి వెళ్లకుండా తమకు నచ్చిన రీతిలో సినిమాను డైరెక్ట్ చేస్తూ సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి డైరెక్టర్స్ టాలీవుడ్ లో ఎవరు ఉన్నారో ఇప్పుడు చూసేయండి.
Advertisement
సుకుమార్:
డైరెక్టర్ మొదటి నుంచి తన సినిమాల్లో వైవిధ్యమైన కథనాన్ని చూపిస్తూ వచ్చారు. తన సినిమాలు చూసే ప్రేక్షకులకు పజిల్ పెడుతూ వారిని సినిమా ఎంజాయ్ చేసేలా చేస్తాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సుకుమార్ ముందుంటారు.
రాజమౌళి:
Advertisement
దర్శకేంద్రుడు రాజమౌళి అసలు రీమేక్ అన్న పదాన్నే వినడానికి ఇష్టపడరు. ఆల్రెడీ చూసేసిన సినిమానే మళ్ళీ తీయడంలో కిక్ ఏమీ ఉండదని ఆయన ఫీల్ అవుతారు. ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి తన ఓన్ గా కంటెంట్ తో డైరెక్షన్ చేసి సినిమాని అదిరగొట్టేస్తాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కి వచ్చిన రాజమౌళికి ఇక తన కెరీర్ లో రీమేక్ చేయాల్సిన అవసరమే లేదు.
కొరటాల శివ:
సుకుమార్, రాజమౌళిల తరువాత తన సొంత కంటెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న మరో డైరెక్టర్ కొరటాల శివ. తన సినిమాలో బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చే కొరటాల శివ కూడా తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు.
Read More:
సినిమాల్లో కాళ్ళు మొక్కే సీన్స్ కి ఒకే చెప్పిన హీరోస్.. వీళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్!
శనివారం రోజు ఈ పనులు చేసిన, ఈ వస్తువులు కొన్నా శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు.. జాగ్రత్త!