Advertisement
తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే మూడొందల కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ఫీవర్ ఎవ్వరిని వదల్లేదు. తెలుగు ప్రేక్షకులకు అంతలా ఈ సినిమా ఎక్కేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా… ఇంకా ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటె.. ఇప్పుడు ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే.. రుధిరమణి చుట్టూ తిరిగే సన్నివేశాలు అయితే.. మరింత ఆకర్షణగా నిలుస్తాయి. హనుమాన్ సినిమాలో ఆర్ట్ వర్క్ కోసం పని చేసిన నాగేంద్ర ఈ సినిమాలో సన్నివేశాల గురించి మరిన్ని విషయాలను తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ కథ చెప్పిన టైం లోనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అంజనాద్రి సెట్ వెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఫాంటసీకి, రియాలిటీకి దగ్గరగా ఉండేలా ఈ సెట్ ఉండాలని భావించినట్లు తెలిపారు.
Advertisement
వట్టినాగులపల్లిలోని వ్యవసాయ భూమినే లీజుకి తీసుకుని అంజనాద్రిని సెట్ వేశామని నాగేంద్ర తెలిపారు. అయితే.. హనుమంతుడి రక్త బిందువు నుంచి రుధిరమణి ఏర్పడడాన్ని చూపించడం మాత్రం మాకో సవాల్ గా మారిందని అన్నారు. రామనామంతో ఉండే రుధిర మణులను వందకు పైగా రూపొందించామని.. కానీ వాటిలో చివరకు ఒకదాన్ని ఫైనల్ చేశామని నాగేంద్ర తెలిపారు. ఇక విలన్ ఇంట్రడక్షన్ సన్నివేశాల కోసం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ నే వాడుకున్నామని తెలిపారు. బడ్జెట్ పరిమితులు ఉండడం వల్లే ఈ సినిమాకు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయని నాగేంద్ర అన్నారు.
Read More:
మెగాస్టార్ చిరంజీవి వల్లే మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడని తెలుసా?
ఇప్పటి వరకు ఒక్క రీమేక్ కూడా చేయని స్టార్ డైరెక్టర్స్ వీరే.. లిస్ట్ ఓ లుక్ వేయండి!
కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!