Advertisement
అన్న సీఎం జగన్ ను కాదని తెలంగాణ వెళ్లి సొంతంగా పార్టీ పెట్టిన షర్మిల ఇప్పుడు తిరిగి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఎపి రాజకీయాలని హీటెక్కించింది. అయితే.. ఎపి రాజకీయాల్లో జరుగుతున్నా పరిణామాలను గమనిస్తున్న నెటిజన్స్ గతంలో పాతికేళ్ల క్రితం హరికృష్ణకు జరిగిందే ఇప్పుడు షర్మిల కి జరుగుతుందా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి వీరిద్దరి రాజకీయ జీవితాలను గమనించి చూస్తే ఆ సందేహం మనకి కూడా కలుగుతుంది.
Advertisement
నిజానికి షర్మిలకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె తన భర్త, పిల్లలతో హ్యాపీ గానే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ తన అన్నయ్య జగన్ మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఆమె జీవితమే మారిపోయింది. ఆమెకు సంబంధం లేకున్నా పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చింది. ఇక్కడ జగన్ తో విబేధాలు రావడంతో ఆమె తెలంగాణకు వెళ్లి సొంతంగా పార్టీ పెట్టారు. అయితే.. అక్కడ అంతగా సాగకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి తన మద్దతుని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఇక తిరిగి ఆమె ఆంధ్ర ప్రదేశ్ లోకి వచ్చారు.
Advertisement
పాతికేళ్ల క్రితం హరికృష్ణ విషయం లో కూడా ఇలానే జరిగింది. హరికృష్ణకు కూడా అసలు పాలిటిక్స్ తో సంబంధం లేదు. కానీ, తండ్రి ఎన్టీఆర్ గారు సొంతంగా పార్టీ పెట్టడంతో హరికృష్ణ కూడా ఎన్టీఆర్ గారి కోసమే పాలిటిక్స్ లోకి వచ్చి ఆయనకు రథసారధిగా మారారు. ఆ తరువాత అధికారం చేతులు మారి చంద్రబాబు నాయుడు సీఎంగా ఎన్నికయ్యాక.. హరికృష్ణ మంత్రిగా ఎన్నికయ్యారు. మంత్రి అయ్యిన ఆరు నెలల లోపు ఎమ్మెల్సీగా గాని, ఎమ్మెల్యేగా గని గెలుపొందాల్సి ఉంటుంది. కానీ అది జరగకపోవడంతో హరికృష్ణ గారు ఆ పదవిని కోల్పోయారు. చంద్రబాబు నాయుడుకు హరికృష్ణకు పొసగకపోవడంతో ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత అన్నా తెలుగు దేశం అనే పార్టీని హరికృష్ణగారు పెట్టారు. అప్పటికి ఎన్టీఆర్ గారు చనిపోయి మూడేళ్లు అయ్యింది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్నా తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. వారికి పెద్దగా డిపాజిట్లు దక్కలేదు. హరికృష్ణ గారు కూడా గెలవలేదు. ఎన్నికల్లో తగిలిన దెబ్బకు హరికృష్ణ గారు మళ్ళీ రాజకీయాల ఊసు ఎత్తలేదు. దాదాపు ఏడేళ్ల తరువాత ఆయన తిరిగి ఎన్టీఆర్ భవన్ కు అడుగుపెట్టారు. అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడుని కలిశారు. ఆ తరువాత టీడీపీ లో హరికృష్ణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున హరికృష్ణ నిలబడడమే కాకుండా.. ఎన్టీఆర్ పై టీడీపీ తరపున ప్రచారం చేయాలనీ ఒత్తిడి కూడా తెచ్చారు. తండ్రి మాట కోసమే ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి ప్రచారం చేసారు. చివరకు రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ రాజకీయాలకు, టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. రాజాకీయాల్లోకి సంబంధం లేకపోయినా రావాల్సి రావడం, చేరిన పార్టీతో పొసగకపోవడంతో సొంతంగా కొత్త పార్టీ పెట్టడం, ఆ పార్టీలు డిజాస్టర్లు అవ్వడం.. ఇలా హరికృష్ణ గారి లైఫ్ లో జరిగినదే షర్మిల లైఫ్ లో కూడా జరుగుతూ వస్తోంది.
Read More:
యాత్ర 2 సినిమాలో షర్మిల, లోకేష్, పవన్ క్యారెక్టర్లని ఎందుకు పెట్టలేదో తెలుసా ?
హనుమాన్ సినిమాలో “రుధిరమణి” వెనుక ఇంత కథ జరిగిందా? ఈ సినిమా కోసం ఇన్ని తయారు చేసారా?
మెగాస్టార్ చిరంజీవి వల్లే మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడని తెలుసా?